అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా శాంసంగ్‌ ఫోన్‌

9 Jan, 2018 15:27 IST|Sakshi

శాంసంగ్‌ తన సరికొత్త గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా భారత్‌లోకి విడుదల చేసింది. ఫుల్‌ మెటల్‌ యూనిబాడీ డిజైన్‌, 5.5 అంగుళాల డిస్‌ప్లే, శాంసంగ్‌ పే మినీ సపోర్టుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. అమెజాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ప్రొడక్ట్‌గా మార్కెట్‌లోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌, ధర, అందుబాటులో ఉండే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కొత్త గెలాక్సీ ఆన్‌7 ప్రైమ్‌ కోసం మాత్రం అమెజాన్‌ ఇండియా ఓ పేజీని అంకితం చేసింది. ''నోటిఫై మి'' అనే ఆప్షన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌ లిస్టు చేసింది. ఆన్‌7, ఆన్‌7 ప్రొ మాదిరి ఈ స్మార్ట్‌ఫోన్‌ కూడా బడ్జెట్‌లోనే అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆసక్తి కలిగిన వినియోగదారులు, అమెజాన్‌ ఇండియా స్టోర్‌లో ''నోటిఫై మి'' ఆప్షన్‌లో వివరాలను నమోదుచేసుకోవాలని కంపెనీ పేర్కొంది. 
 

ఇక స్పెషిఫికేషన్ల విషయానికొస్తే.. 
ఈ ఫోన్‌ 1.6గిగాహెడ్జ్‌ , ఆక్టా-కోర్‌ ఎక్సీనోస్‌ 7870 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది
3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
356జీబీ వరకు విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్‌తో వెనుకవైపు, ముందు వైపు కెమెరా
శాంసంగ్‌ పే మినీ సపోర్టు(యూపీఐ లేదా మిగతా మొబైల్‌ వాలెట్ల ద్వారా ఇన్‌స్టాంట్‌ పేమెంట్లు)

>
మరిన్ని వార్తలు