శాంసంగ్‌ ప్రభంజనం, అద్భుత ఫీచర్లు, ఫోటోలు

12 Feb, 2020 20:47 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో:  దక్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్‌20, ఎస్‌20 ప్ల‌స్‌, ఎస్‌20 అల్ట్రాల‌ను విడుద‌ల చేసింది.  అందరూ ఊహించినట్టుగానే  గెలాక్సీ ఎస్ సిరీస్‌లో ఎస్‌11కు బ‌దులుగా శాంసంగ్ ఎస్‌20 సిరీస్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో శాంసంగ్‌ నిర్వ‌హించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ ఫోన్ల‌ను లాంచ్ చేసింది. ఏఐ ఆధారిత  కెమెరాలు, 5 జీ టెక్నాలజీ, భారీ స్టోరేజ్‌ లాంటి అద్భుతమైన ఫీచర్లను జోడించి తన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను ఆవిష్కరించింది.  దీంతోపాటు గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ ఫోల్డింగ్‌ ఫోన్‌ను కూడా   లాంచ్‌  చేసింది.  మొత్తం సిరీస్‌లో స్టోరేజ్‌ పరంగా, డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా తీసుకొచ్చింది. 120హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ స్కానర్‌,  5జి ఫీచ‌ర్‌ను  ప్రధాన ఆకర్షణ.  

గెలాక్సీ ఎస్20 ఫీచ‌ర్లు
6.2 అంగుళాల డిస్‌ప్లే
64+12 +12 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
10 ఎంపీ సెల్ఫీ  కెమెరా 
4000 ఎంఏహెచ్‌బ్యాటరీ
బ్లూ, పింక్‌,  గ్రే కలర్స్‌లో లభ్యం

గెలాక్సీ ఎస్‌ 20 ప్ల‌స్‌ ఫీచర్లు 
6.7 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ 
డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే
64+12 +12,3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌   క్వాడ్‌ రియర్‌ కెమెరా
10ఎంపీ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఈ రెండు ఫోన‍్లను రెండువేరియంట్లలో లాంచ్‌ చేసింది. 
8 జీబీ  ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌
1 టీబీ దాకా  స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం 

అలాగే ఈ ఫోన్ల‌లో ఆయా దేశాల మార్కెట్‌ల‌కు అనుగుణంగా స్నాప్‌డ్రాగ‌న్ 865 లేదా ఎగ్జినోస్ 990 ప్రాసెస‌ర్‌లు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తాయి. ఈ ఫోన్ల‌లోఅందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, శాంసంగ్ బిక్స్‌బీ, హెల్త్‌, శాంసంగ్ పే యాప్‌లు.. త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్ల‌లో యూజ‌ర్లు పొంద‌వ‌చ్చు. 

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా  ఫీచ‌ర్లు
 6.97 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే  
స్నాప్‌డ్రాగ‌న్ 865 లేదా ఎగ్జినోస్ 990 ప్రాసెస‌ర్
3200 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆండ్రాయిడ్ 10 
12/16 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్
108+12 + 48 ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
 40 ఎంపీ సెల్పీ కెమెరా 
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ధ‌ర‌లు 
గెలాక్సీ ఎస్‌20 4జి -981 డాల‌ర్లు    రూ.69,980 
గెలాక్సీ ఎస్‌20 5జి - 999 డాల‌ర్లు సుమారు.రూ.71,325 
గెలాక్సీ ఎస్‌20 ప్ల‌స్ 5జి 128జీబీ వేరియంట్‌ 1199 డాల‌ర్లుసుమారు రూ.85,590 
గెలాక్సీ ఎస్‌20 ప్ల‌స్ 5జి 512జీబీ - 1299 డాల‌ర్లు  సుమారు. రూ.92,720 
గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా 5జి 12జీబీ + 128జీబీ - 1399 డాల‌ర్లు  సుమారు రూ.99,840
గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా 5జి 16జీబీ + 512జీబీ - 1499 డాల‌ర్లు  సుమారు రూ.1,06,975

ఈ స్మార్ట్‌పోన్లు అన్నింటిలోనూ  కెమెరాల‌ ద్వారా యూజ‌ర్లు ఏకంగా 8కె రిజ‌ల్యూష‌న్‌తో అద్భుత‌మైన క్వాలిటీ వీడియోల‌ను చాలా సుల‌భంగా షూట్ చేసుకోవ‌చ్చు. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రీ ఆర్డ‌ర్లు ప్రారంభం కానుండగా, మార్చి 6వ తేదీ నుంచి వీటిని మార్కెట్‌లో విక్ర‌యిస్తారు. అయితే ఈ ఫోన్లను భార‌త్‌లో ఎప్పుడు విడుద‌ల చేసేదీ, వాటి ధ‌ర వివ‌రాల‌ను శాంసంగ్ ఇంకా వెల్ల‌డించ‌లేదు.

చదవండి:
శాంసంగ్‌ జెడ్‌ ప్లిప్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌
దిగొస్తున్న పుత్తడి ధర​​​​​​​

మరిన్ని వార్తలు