శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్స్ వచ్చేశాయ్!

8 Jun, 2020 14:29 IST|Sakshi

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 6 లైట్ ఆవిష్కరణ

 ప్రారంభ ధర రూ. రూ .27,999

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్  కొత్త ట్యాబ్స్ ను లాంచ్ చేసింది. మెటల్ యూనీ-బాడీ డిజైన్‌తో ‘గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్’ పేరుతో దీన్ని భారత్‌లో సోమవారం  ప్రవేశపెట్టింది. గత ఏప్రిల్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్‌ను విడుదల చేసిన వీటి ప్రారంభ ధర రూ. 27,999 గా ఉంచింది. శాంసంగ్.కామ్, అమెజాన్ ద్వారా ఈ రోజు (జూన్‌ 8) నుంచి 16వరకు  ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంచింది.  జూన్ 17వ తేదీనుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయి. గెలాక్సీ టాబ్  ఎస్ 6 లైట్  మూడు రంగులలో  లభ్యం.

ఇ-లెర్నింగ్, వర్క్ ఫ్రం హోం సాధారణమైన ప్రస్తుత సందర్భంలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా  గెలాక్సీ టాబ్ ఎస్ 6 లైట్ తీసుకొచ్చినట్టు శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ అన్నారు. ఎస్ 6 లైట్ లో జోడించిన ఎస్ పెన్‌తో విద్యార్థులు, మల్టీ టాస్కింగ్ వినియోగదారులకు  ఉపయోగపడుతుందన్నారు. 

ఆఫర్లు
ప్రీ-బుక్ చేసే కొనుగోలుదారులు గెలాక్సీ బడ్స్ + రూ .2999 కే కొనుగోలు చేయవచ్చు. లేదా రూ. 4,999 విలువ చేసే  గెలాక్సీ టాబ్ ఎస్ 6 లైట్ బుక్ కవర్ ను .2,500 కు కొనుగోలు చేయడానికి అర్హులు. 

గెలాక్సీ టాబ్ ఎస్6 లైట్  ఫీచర్లు 
టాబ్ ఎస్ 6 లైట్ ఎస్ పెన్ సపోర్ట్‌, 10.4 అంగుళాల 2000x1200 ఎల్‌సిడి టచ్‌స్క్రీన్‌, ఎక్సినోస్ 9611 సాక్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్,7040 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా,  5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా జోడించింది. 
ధరలు  
గెలాక్సీ టాబ్ ఎస్6 లైట్ రూ .31,999
వై-ఫై వెర్షన్‌ ధర  రూ .27,999
 

మరిన్ని వార్తలు