శాంసంగ్‌ నుంచి  కన్జూమర్‌ రుణాలు

27 Sep, 2019 02:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ శాంసంగ్‌ ‘శామ్‌సంగ్‌ ఫైనాన్స్‌ ప్లస్‌’ పేరుతో డిజిటల్‌ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌నే గురువారం ప్రారంభించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఉత్పత్తుల కొనుగోలుదారులకు రుణాలను ఆఫర్‌ చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. శాంసంగ్‌ ఫైనాన్స్‌ ప్లస్‌ అన్నది ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లు, డీలర్లను అనుసంధానించే ప్లాట్‌ఫామ్‌. దేశవ్యాప్తంగా 30 పట్టణాల్లోని 5,000కు పైగా స్టోర్లలో ఇది అందుబాటులో ఉంటుందని, ఈ ఏడాది చివరికి 100 పట్టణాల్లోని 10,000 స్టోర్లను చేరుకుంటామని శాంసంగ్‌ ఇండియా తెలిపింది. ‘‘పాశ్చాత్య దేశాల్లో 80% ఫోన్లను ఫైనాన్స్‌లోనే తీసుకుం టారు. భారత్‌లో కేవలం 15–18 శాతమే ఫైనాన్స్‌ ద్వారా తీసుకుంటున్నారు’’ అని శాంసంగ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. దేశంలో 45 కోట్ల మందికి క్రెడిట్‌ హిస్టరీ లేదని, ఫైనాన్స్‌తో కొనుగోలుకు వారికి అవకాశం కల్పించడమే ఈ సేవల ఉద్దేశమన్నారు.

మరిన్ని వార్తలు