శాంసంగ్‌ గెలాక్సీ సరికొత్త స్మార్ట్‌ వాచ్‌

9 Jul, 2020 19:15 IST|Sakshi

ముంబై: ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ త్వరలో సరికొత్త స్మార్ట్ వాచ్‌ల(గడియారాలు)తో అలరించనుంది. మేకిన్‌ ఇండియా స్పూర్తితో నోయిడాలో స్మార్ట్‌ వాచ్‌ల తయారీని ప్రారంభించింది. ఇటీవలే అత్యాధునిక టెక్నాలజీ(4జీ మోడల్‌)తో  స్మార్ట్‌వాచ్‌ను సామ్‌సంగ్‌ విడుదల చేసింది. ఈ వాచ్‌ ధరను రూ. 28,490 రూపాయలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా జులై 11న మార్కెట్‌లోకి విడుదలయ్యే స్మార్ట్ వాచ్‌ (గ్యాలెక్సీ వాచ్‌ యాక్టివ్‌2) 4జీ పేరుతో అత్యాధునిక స్మార్ట్‌ వాచ్‌ వినియోగదారులను అలరించనుంది. కాగా మేకిన్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా దేశంలో 18 స్మార్ట్‌ వాచ్‌ల తయారీని ప్రారంభించినట్లు శాంసంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌సింగ్‌ తెలిపారు.

అయితే శాంసంగ్‌ కంపెనీ గాలెక్సీ స్మార్ట్‌ వాచ్‌లను మూడు రకాలైన సైజులు(42ఎమ్‌ఎం, 44ఎమ్‌ఎం, 46ఎమ్‌ఎంలతో కస్టమర్లకు అందించనుంది). మరోవైపు దేశంలో తయారు కానున్న 18స్మార్ట్‌ వాచ్‌ల ధర(రూ.19, 990 నుంచి రూ. 35,990)గా శాంసంగ్‌ నిర్ణయించింది. అయితే జులై 11న విడుదల కానున్న శాంసంగ్‌ సరికొత్త స్మార్ట్‌ వాచ్‌లో ఇ సిమ్‌ కనెక్టివిటీతో వినియోగదారులకు కాల్స్‌, మెసేజెస్‌, నోటిఫికేషన్స్ తదితర అత్యాధునిక సేవలను స్మార్ట్‌ వాచ్‌ అందించనుంది. (చదవండి: గెలాక్సీ నోట్ 10 లైట్ ధర తగ్గింది : క్యాష్‌బ్యాక్ కూడా)

మరిన్ని వార్తలు