శాంసంగ్ ఫోన్లు వాటర్ రెసిస్టెంట్ కాదట?

9 Jul, 2016 16:51 IST|Sakshi
శాంసంగ్ ఫోన్లు వాటర్ రెసిస్టెంట్ కాదట?

వాటర్ ప్రూఫ్   స్పెషల్ ఫీచర్  అంటూ  ప్రకటన ద్వారా ఊదర గొట్టిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారు శాంసంగ్  కంపెనీకి షాక్ తగిలింది.  ఫ్లాగ్ షిప్ ఫోన్ల మొబైల్  ప్రపంచంలోకి అడుగుపెట్టిన   హై ఎండ్ కేటగిరీ గెలాక్సీ ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్  , యాక్టివ్ లలో సంస్థ చెబుతున్నట్టుగా వాటర్ ప్రూఫ్  సౌకర్యం లేదని తేలిపోయింది.  ఉత్పత్తుల టెస్టింగ్స్ లో పేరు గడించిన సంస్థ  కన్జ్యూమర్స్  అనే స్వచ్ఛంద సంస్థ   తమ పరీక్షలలో  వాటి ప్రామాణికత నిలబడలేదని స్పష్టం చేసింది.  అందుకే తాము ఈ  ఫోన్టను రికమెండ్ చేయలేమని  పేర్కొంది.  

 అమెరికాలో ఎటి అండ్ టీలో మాత్రమే అందుబాటులోఉన్న ఎస్ 7యాక్టివ్ వాటర్  రిసిస్టెంట్ కాదని (జలనిరోధితం) చెప్పింది. అలాగే ఎస్7 ఎడ్జ్, యాక్టివ్ పై చేసిన పరీక్షల్లో కూడా వాటర్  ప్రూఫ్  నిరూపితం కాలేదని తెలిపింది. ఈ స్మార్ట్  ఫోన్ ను ఒక అరగంట నీళ్లలో ఉంచినపుడు యాక్టివ్ ఫోన్ స్క్రీన్ గ్రీన్ , పసుపు రంగుల్లో మారిపోయిందనీ,  టచ్ పనిచేయలేదని  తమ రిపోర్టులో  తేలిందన్నారు. అంతేకాదు కెమెరా లెన్సెస్ మీద బుడగలుకూడా కనిపించాయని...  రెండు ఫోన్ల పరీక్షల్లోనూ ఇదే ఫలితం  వచ్చిందని సంస్థ  డైరెక్టర్ మారియా రెక్రిక్ తెలిపారు. శాంసంగ్ చెబుతున్న క్వాలిటీ ని  ఈ ఫోన్లు రీచ్ కాలేకపోతున్నాయని.. ఆన్ లైన్ లో  కొనుగోలు చేసిన  రెండు ఫోన్లను ఈ పరీక్షల్లో ఫెయిలైనట్టు వెల్లడించారు. శాంసంగ్ యాక్టివ్   ఫెయిల్ కావడం తనకు చాలా  ఆశ్చర్యం కలిగించిదన్నారు.  సాధారణంగా శాంసంగ్ ఫోన్లు నాణ్యతకు మారుపేరుగా నిలుస్తాయని  వ్యాఖ్యానించారు.  ఎస్ 7,ఎస్ 7ఎడ్జ్, బ్యాటరీ లైఫ్,  కెమెరా, డిస్ ప్లే లో  అద్భుతంగా ఉన్నాయని కన్జ్యూమర్స్ పేర్కొంది.
దీనిపై స్పందించిన శాంసంగ్   చాలా తక్కువ ఫిర్యాదులు మాత్రమే తమకు అందాయని తెలిపింది. ఈ విషయంలో కన్జ్యూమర్ రిపోర్ట్స్ ను పరిశీలిస్తున్నామని, దానితో టచ్ లో  ఉన్నట్టు చెప్పింది.  కాగా  5 అడుగుల నీటిలో అరగంట సేపు ఉన్నా తట్టుకునే సామర్థ్యం తమ  ఫోన్లకు ఉందని శాంసంగ్  యూజర్లకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు