శాంసంగ్‌ 5జీ మడత ఫోన్‌ లాంచ్‌ 

20 Nov, 2019 13:46 IST|Sakshi

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్‌ సరికొత్త ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. శాంసంగ్ డబ్ల్యు 20 5జీ పేరుతొ దీన్ని బుధవారం  లాంచ్‌ చేసింది. గెలాక్సీ ఫోల్డ్  రీబ్రాండెడ్ వెర్షన్‌ 5జీ  అప్‌ గ్రేడ్ చేసి  ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+  సాక్‌  మినహా మిగిలిన ఫీచర్లను గెలాక్సీఫోల్డ్‌ మాదిరిగా ఉంచింది. ఎకెజి-ట్యూన్డ్ స్పీకర్లు,  డాల్బీ అట్‌మాస్‌ సపోర్ట్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, బేరోమీటర్, జియోమాగ్నెటిక్, గైరోస్కోప్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ ప్రింట్‌సెన్సర్‌  లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ పవర్ షేర్‌కు మద్దతు ఇస్తుంది.  డిసెంబరునుంచి ఇది చైనాలో అందుబాటులోకి రానుంది.ధర వివరాలు, ఇతర మార్కెట్లలో దీని లభ్యత  తదితర వివరాలను శాంసంగ్‌ ఇంకా వెల్లడించలేదు. అయితే దీని ధర సుమారు రూ. 1,73,000 గా వుంటుందని అంచనా.

శాంసంగ్  డబ్ల్యూ 20 5జీ  ఫీచర్లు 
 ఫస్ట్‌ స్ట్రీన్‌
 4.2: 3 కారక నిష్పత్తి, 1536x2152 పిక్సెల్స్ రిజల్యూషన్
 7.3-అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డైనమిక్ అమోలేడ్ డిస్‌ప్లే 

సెకండ్‌ స్క్రీన్‌
840x1960 పిక్సెల్స్ రిజల్యూషన్ , 21: 9 కారక నిష్పత్తి
4.6 అంగుళాల సూపర్ అమోలెడ్ కవర్ డిస్‌ ప్లే
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్‌
12 జీబీ ర్యామ్, 512 జీబీ  స్టోరేజ్‌
 ఎస్‌డి కార్డ్ ద్వారా  స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం 
16+12+12 ఎంపీ  ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
10 + 8 ఎంపీ  డబుల్‌ సెల్ఫీ కెమెరా
4235 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా