రూ.10కోట్ల ఉంగరం, వాచీలు, కాస్ట్‌లీ పెయింటింగ్స్‌

24 Mar, 2018 14:29 IST|Sakshi
సీబీఐ , ఈడీ సీజ్‌ చేసిన డైమండ్‌ రింగ్‌, వాచీ

సాక్షి, ముంబై: పంజాబ్‌ నేషనల్‌  బ్యాంకు స్కాంలో  ప్రధాన నిందితుడు  డైమండ్‌ వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులపై దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ సందర‍్భంగా కళ్లు చెదిరే డైమండ్‌ ​ఆభరణాలను, విలువైన వాచీలను, ఎంఎఫ్‌ హుస్సేన్‌  సహా ప్రముఖుల పెయింటింగ్స్‌ను  అధికారులు సీజ్‌ చేశారు.  తాజా దాడుల్లో రూ.26కోట్ల విలువైన ఆస్తులను  స్వాధీనం చేసుకున్నారు.

ముంబైలోని  విలాసవంతమైన నివాస ప్రాంతాల్లో ఒకటైన సముద్ర మహల్‌లో నీరవ్‌మోదీకి చెందిన  భవనాల్లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులను సీబీఐ, ఈడీ సీజ్‌ చేశాయి. 15కోట్ల విలువైన  వజ్రాల నగలు,  డైమండ్లు పొదిగిన రూ. 1.40కోట్ల వాచీలు,  రూ.10కోట్ల విలువైన ఎంఫ్‌ హుస్సేన్‌, హెబ్బార్‌, అమ్రితా షెర్గిల్‌ ల పెయింటింగ్స్‌ ,  ముఖ్యంగా 10కోట్ల రూపాయల విలువైన డైమండ్‌ రింగ్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

కాగా దేశంలో అతపెద్ద బ్యాంకింగ్‌ స్కాంగా నిలిచిన పీఎన్‌బీ స్కాంలో కీలక నిందితులుగా నీరవ్‌ మోదీ,ఆయన మామ, మెహుల్‌ చోక్సీ తదితరులపై  మనీలాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇప్పటివరకు ఈడీ ఎటాచ్‌ చేసిన మొత్తం ఆస్తులు విలువ రూ. 7600 కోట్లుగా నిలిచింది.

మరిన్ని వార్తలు