విశాల్‌ సిక్కాకు భారీ ఎదురుదెబ్బ

16 Jun, 2017 13:36 IST|Sakshi
విశాల్‌ సిక్కాకు భారీ ఎదురుదెబ్బ

బెంగళూరు: ఇటీవలికాలంలో  ఫౌండర్స్‌నుంచి  తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఇన్ఫోసిస్‌  సీఈవో విశాల్‌ సిక్కాకు భారీ  ఎదురుదెబ్బ తగిలింది.  దేశీయ అతిపెద్ద ఐటీ సేవల   సంస్థ ఇన్ఫోసిస్‌ అమెరికా హెడ్, రిటైల్ యూనిట్ గ్లోబల్ అధిపతి సందీప్ డాడ్లని  రాజీనామా  చేశారు.  ఈ కంపెనీ కృత్రిమ మేధస్సు వేదిక నియా సహా కొత్త సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ నుంచి మరింత వ్యాపారాన్ని సృష్టించే యోచనలో ఇటీవలే డాడ్లాకు విశాల్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు.   

ఇన్ఫోసిస్  ప్రతినిధులు కర్మేష్‌ వాస్వాని, నితీష్ బంగ ఈ  పరిణామాన్ని నిర్ధారిస్తూ ఒక ప్రకటన  విడుదల చేశారు.  ఎందుకు కంపెనీని వీడారు అనే అంశంపై  స్పష్టత లేనప్పటికీ గత వారమే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

ఇన్ఫోసిస్ దాని ఇతర భారతీయ ఐటి ప్రత్యర్థుల లాగా, రిటైల్ జెయింట్స్ వాల్-మార్ట్ స్టోర్స్ ఇంక్. మరియు బెస్ట్ బై కో  సంస్థల నుంచి వ్యాపారం క్రమేపీ క్షీణిస్తోంది. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్‌ సంస్థలతోపాటు, రిటైల్ కంపెనీలు రెండవ అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉన్నాయి. వీరు ఎక్కువగా ఆన్‌లైన్‌ సేవలవైపు మొగ్గు చూపడంతో  ఇబ్బందుల్లో  ఉన్న ఇన్ఫోసిస్కు  తాజా బిజినెస్‌ సీనియర్-ఎగ్జిక్యూటివ్ రాజీనామాతో సిక్కాకు  మునుముందు మరింత గడ్డుకాలమేనని నిపుణులు భావిస్తున్నారు. 

కాగా 2001,జనవరిలో ఇన్ఫోసిస్‌లో చేరిన డాడ్లని, 2014 లో ఇన్ఫోసిస్లో ఉన్నత ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఇన్ఫీ నలుగురు ప్రెసిడెంట్లలో ఒకరైన డాడ్లని, ఇన్ఫోసిస్  పూర్తిస్థాయి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎడ్జె  సెర్వ్‌కి  ఛైర్మన్‌గా కూడా ఉన్నారు
 

మరిన్ని వార్తలు