ఈ ఏడాది ఒడిదుడుకులే..!

2 Jul, 2018 00:14 IST|Sakshi

యూటీఐ ఫండ్‌ మేనేజర్‌ సంజయ్‌ డోంగ్రే

అధిక స్థాయిలో మార్కెట్‌ వేల్యుయేషన్లు

కాబట్టి భారీ రాబడులుండకపోవచ్చు

ఆశావహంగా ఆటో, ఆర్థిక రంగం

ఇన్‌ఫ్రాకు రాబోయేది మంచికాలమే

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో : వేల్యుయేషన్స్‌పరంగా మార్కెట్లు సగటుకన్నా అధిక స్థాయిలో ట్రేడవుతున్న నేపథ్యంలో గత మూడేళ్లుగా నమోదవుతున్న అధిక రాబడులు ఈ సారి కనిపించకపోవచ్చన్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ సంజయ్‌ డోంగ్రే. ఆటో, సిమెంటు, నిర్మాణ, ఆర్థిక రంగ షేర్లు ఆశావహంగా ఉండవచ్చన్నారు. ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు వెల్లడించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...

ఈ ఆర్థిక సంవత్సరం మార్కెట్లు ఎలా ఉండొచ్చు?
ఈ ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ రాబడులు 18–20% మేర, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 14–15 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. దీనికి గతేడాది బేస్‌ ఎఫెక్ట్‌ కూడా కారణం. ప్రధానంగా దేశీ వినియోగ ఆధారిత రంగాల నుంచి ఈ వృద్ధి రావొచ్చు. ఈ సారి జీడీపీ వృద్ధి 7.3 శాతం ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. గతానికన్నా భిన్నంగా తయారీ రంగం వాటా ఇందులో మరింత పెరగొచ్చు. అలాగే ఆటో, సిమెంటు, నిర్మాణ, ఇంజినీరింగ్‌ ఆర్థిక రంగాలు రెండంకెల స్థాయి వృద్ధిని సాధించొచ్చు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు, కార్పొరేట్‌ ఆధారిత ప్రైవేట్‌ బ్యాంకుల ఆదాయాలు మెరుగుపడొచ్చు. గత ఏడాదిన్నర, రెండేళ్లుగా కార్పొరేట్లకు భారీగా రుణాలిచ్చిన ప్రైవేట్‌ రంగ బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. అయితే, ఈ బ్యాంకులు ప్రస్తుతం ఆయా మొండిపద్దులను గుర్తించి, సరిదిద్దుకునే విషయంలో తుదిదశలో ఉన్నాయి. వచ్చే 12 నెలల్లో వీటి లాభదాయకత మళ్లీ సాధారణ స్థాయికి రావొచ్చు. కాబట్టి, కార్పొరేట్‌ ఆధారిత ప్రైవేట్‌ బ్యాంకుల ప్రైస్‌ టు బుక్‌ మల్టిపుల్‌ మెరుగుపడొచ్చు.  

ఈక్విటీ మార్కెట్ల వేల్యుయేషన్స్‌ ఎలా ఉన్నాయి?
గత పదేళ్లుగా ఫార్వర్డ్‌ ఎర్నింగ్స్‌ పరంగా చూస్తే వేల్యుయేషన్స్‌ సగటున 16 రెట్లు ఉంటున్నాయి. కానీ ప్రస్తుతం 17 రెట్ల స్థాయిలో సగటు కన్నా అధికంగా మార్కెట్లు ట్రేడవుతున్నాయి. కనుక వేల్యుయేషన్స్‌ అంత చౌకగా ఏమీ లేవు. కాబట్టి మార్కెట్ల నుంచి రాబడుల అంచనాలు కింది వైపుగానే ఉండొచ్చు.

గత మూడేళ్లుగా నమోదవుతున్న అత్యధిక రాబడులు ఈ సారి కనిపించకపోవచ్చు. ఇక స్థూల ఆర్థిక పరిస్థితులు చూస్తే..  ద్రవ్యోల్పణం, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. కరెంటు అకౌంటు లోటు దాదాపు 1.6 శాతం మేర ఉంది. మూడేళ్ల పాటు అంతంత మాత్రంగా నమోదైన ఆదాయాలు మళ్లీ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందొచ్చన్న అంచనాలున్నాయి.

ముఖ్యంగా బ్యాంకింగ్‌ వంటి రంగాల ఆదాయాలు సాధారణ స్థాయికి రావొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు స్థూల ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నా .. మరోవైపు కార్పొరేట్ల ఆదాయాలు మెరుగుపడనున్నాయి. దీనితో ఒకరకంగా సమతుల్యత నెలకొనే అవకాశమున్నా.. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఒడిదుడుకులూ ఎక్కువగానే ఉండొచ్చు.

ఏయే రంగాలు ఆశావహంగా ఉన్నాయనుకోవచ్చు?
ఏ రంగమైనా, షేరయినా వేల్యుయేషన్స్‌ నిలకడగా ఉండాలంటే ఆదాయాల వృద్ధే కీలక పాత్ర పోషిస్తుంది. కనక వచ్చే రెండేళ్లలో ఆదాయ వృద్ధి అధికంగా ఉండే రంగాలు, షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ కొనసాగించవచ్చు. అలాగే మార్కెట్‌ ఆదాయాల కన్నా తక్కువ స్థాయిలో నమోదు చేసే రంగాల షేర్లలో పెట్టుబడులు తగ్గించుకోవటమే శ్రేయస్కరం.

ఆటో, సిమెంట్, ఇంజినీరింగ్, నిర్మాణం, ఆర్థిక రంగ సంస్థలు రాబోయే రెండేళ్లలో అధిక ఆదాయాలు నమోదు చేయొచ్చు. వేల్యుయేషన్స్‌ పరంగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డ్యూరబుల్‌ స్టాక్స్‌ గత పదేళ్ల సగటుతో పోలిస్తే గణనీయంగా అధిక వేల్యుయేషన్స్‌తో ట్రేడవుతున్నాయి.

మీరు ఇన్‌ఫ్రా ఫండ్‌ను నిర్వహిస్తున్నారు కదా. ఈ రంగంపై మీ అంచనాలేంటి?
దాదాపు 7,400 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై వంటి 12 నగరాల్లో మెట్రో రైల్‌ ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటి విలువ రూ.2 లక్షల కోట్లపైనే. రైల్వే శాఖ కూడా భారీ పెట్టుబడులతో నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.

వచ్చే 3–5 సంవత్సరాల్లో ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో కొత్తగా ఎయిర్‌పోర్టుల నిర్మాణం, నాన్‌ మెట్రోల్లో ఎయిర్‌పోర్టుల ఆధునీకీకరణ మొదలైన వాటిపై భారీగా పెట్టుబడులు రావొచ్చు. ఇక, పలు రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులపై రూ.లక్ష కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాయి. అలాగే, అందరికీ అందుబాటు గృహాల ప్రాజెక్టులకు సంబంధించి రూ.5 లక్షల కోట్ల మేర అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్రా రంగం పరిస్థితి ఆశావహంగానే ఉంది.

ఆర్‌బీఐ పాలసీ రేట్ల పెంపు ప్రభావం ఇన్‌ఫ్రా కంపెనీలపై ఎలా ఉండొచ్చు?
ఇన్‌ఫ్రా ప్రాజెక్టులన్నింటికీ భారీ పెట్టుబడులు అవసరం. కనుక వడ్డీ రేట్లు ఏమాత్రం పెరిగినా అది కంపెనీ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే, వడ్డీ రేట్ల పెంపునకు అధిక ఆర్థిక వృద్ధి కారణమైన పక్షంలో .. కంపెనీల ఆదాయాలూ అధిక స్థాయిలో ఉండి వడ్డీ రేట్ల పెంపు ప్రభావం తటస్థంగా ఉండొచ్చు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18% వృద్ధి

డైరెక్ట్‌ ప్లానా? రెగ్యులర్‌ ప్లానా?

రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్‌ బ్యాంకు నిర్ణయం

ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

ఏ పరిస్థితులకైనా అనువైన ఫండ్‌

విద్యా రుణానికి మెరుగైన మార్గం

ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత

అమ్మకాల  సెగ : భారీ నష్టాలు

ఈ ప్రోత్సహకాలు లాభాన్నిచ్చేవే..!

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌