ఆర్థిక శాఖ సలహాదారుగా సంజీవ్‌ సన్యాల్‌

4 Feb, 2017 01:11 IST|Sakshi
ఆర్థిక శాఖ సలహాదారుగా సంజీవ్‌ సన్యాల్‌

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సంజీవ్‌ సన్యాల్‌ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ద క్యాబినెట్‌(ఏసీసీ) ఆమోదించిందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయన వేతన స్కేలు రూ.67,000–79,000 అని పేర్కొన్నారు. సంజీవ్‌ సన్యాల్‌.. ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్, ఆక్స్‌ఫర్డ్,సెయింట్‌ జాన్స్‌  కాలేజ్‌ల్లో విద్యనభ్యసించారు. గతంలో సంజీవ్‌ సన్యాల్‌ డాషే బ్యాంక్‌ ఎండీగా పనిచేశారు.పలు పుస్తకాలను ఆయన రచించారు.

ల్యాండ్‌ ఆఫ్‌ ద సెవెన్‌ రివర్స్‌: ఏ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియాస్‌ జియోగ్రఫీ, ద ఇండియన్‌ రినైసెన్స్‌: ఇండియాస్‌ రైజ్‌ ఆఫ్టర్‌ ఏ ధౌజండ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ డిక్లైన్, ద ఇన్‌క్రెడిబుల్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియాస్‌ జియోగ్రఫీ తదితర పుస్తకాలను ఆయన రచించారు. రాయల్‌ జియోగ్రఫికల్‌ సొసైటీ(లండన్‌) ఫెలోగా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. పట్టణ అంశాలపై ఆయన చేసిన కృషికి గాను 2007లో ఐసెన్‌హోవర్‌ ఫెలోషిప్‌ లభించింది. 2014 వరల్డ్‌ సిటీస్‌ సమ్మిట్‌లో సింగపూర్‌ ప్రభుత్వం ఆయనను సత్కరించింది.

మరిన్ని వార్తలు