ఆరు కంపెనీలపై ట్రేడింగ్‌ ఆంక్షలు ఎత్తివేత

12 Aug, 2017 02:55 IST|Sakshi
ఆరు కంపెనీలపై ట్రేడింగ్‌ ఆంక్షలు ఎత్తివేత

శాట్‌ ఆదేశాలు  
ముంబై: పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌ సహా ఆరు కంపెనీలకు గురువారం ఊరట దక్కింది. ఈ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌పై సెబీ విధించిన ఆంక్షలను స్టే రూపంలో సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) పక్కన పెట్టింది. జాబితాలో పార్శ్వనాథ్‌ డెవలపర్స్, కవిట్‌ ఇండస్ట్రీస్, పిన్‌కాన్‌ స్పిరిట్, సిగ్నెట్‌ ఇండస్ట్రీస్, ఎస్‌క్యూఎస్‌ ఇండియా బీఎఫ్‌ఎస్‌ఐ, కె–కల్పన ఇండస్ట్రీస్‌ ఉన్నాయి.

ఈ కంపెనీల వాదన వినాలని, వీటి వ్యాపారాలపై దర్యాప్తు నిర్వహించాలని శాట్‌ ఆదేశించింది. దీంతో ఈ కంపెనీ షేర్లలో సోమవారం నుంచి ట్రేడింగ్‌ కొనసాగనుంది. 331 అనుమానిత షెల్‌ కంపెనీలపై సెబీ ట్రేడింగ్‌ ఆంక్షలకు ఆదేశించిన విషయం గుర్తుండే ఉంటుంది. సెబీ, స్టాక్‌ ఎక్సే ్చంజ్‌లు కంపెనీల వాదన వినాలని, వాటి వ్యాపార కార్యకలాపాలపై దర్యాప్తు నిర్వహించి, ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకోవాలని శాట్‌ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు