ఎస్‌బీహెచ్ మాన్‌సూన్ ధమాకా

30 Jun, 2015 10:09 IST|Sakshi
ఎస్‌బీహెచ్ మాన్‌సూన్ ధమాకా

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ‘మాన్‌సూన్ ధమాకా 2015’ పేరుతో ప్రత్యేక హౌసింగ్ లోన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రచార కార్యక్రమ సమయంలో తీసుకునే గృహరుణాలపై ఎస్‌బీహెచ్ వివిధ రాయితీలను ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గించడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ పేమెంట్ పెనాల్టీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

30 ఏళ్ళ కాలానికి లక్ష రూపాయలకు ప్రతీ నెలా ఈఎంఐగా రూ. 882 చెల్లిస్తే సరిపోతుంది. చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తంపై రోజువారీ విధానంలో వడ్డీని లెక్కిస్తామని, అలాగే మాక్స్‌గెయిన్ పేరుతో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఏడాది వ్యక్తిగత రుణాల పోర్ట్‌ఫోలియోలో 21 శాతం వృద్ధి నమోదు చేయాలని ఎస్‌బీహెచ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
 

మరిన్ని వార్తలు