ఎస్‌బీహెచ్ లాభం 11% వృద్ధి

25 Jul, 2015 00:50 IST|Sakshi
ఎస్‌బీహెచ్ లాభం 11% వృద్ధి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక నికరలాభం 10.6 శాతం వృద్ధితో రూ. 251 కోట్లకు చేరింది. ఇదే సమయంలో మొత్తం వ్యాపారం 9 శాతం పెరిగి రూ. 2.40 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఎస్‌బీహెచ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 998 కోట్ల నుంచి రూ.1,107 కోట్లకు చేరింది. నికరవడ్డీ లాభదాయకత (నిమ్) 3.02 శాతం నుంచి 3.08 శాతానికి పెరిగింది.

గతేడాదితో పోలిస్తే నికర నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. గతేడాది జూన్‌లో రూ. 6,174 కోట్లు(6.26%)గా ఉన్న స్థూల ఎన్‌పీఏలు ఇప్పుడు రూ. 5,482 కోట్లు(5.14%) తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఆర్థిక ఫలితాలకు ఆమోదం తెలిపారు. జూన్ చివరి నాటికి ఎస్‌బీహెచ్ మొత్తం శాఖల సంఖ్య 1,824 ఉంటే అందులో 741 శాఖలు తెలంగాణలో, 400 శాఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు