ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ రూ.750–755

26 Feb, 2020 08:12 IST|Sakshi

మార్చి 2–5 వరకూ ఇష్యూ; 16న లిస్టింగ్‌!

ముంబై: ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ప్రైస్‌బాండ్‌ను నిర్ణయించింది. వచ్చే నెల 2 నుంచి మొదలై 5 వ తేదీన ముగిసే ఈ ఐపీఓకు ప్రైస్‌బాండ్‌గా రూ.750–755ను నిర్ణయించామని ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌  సర్వీసెస్‌ తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)లో భాగం గా 13 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. మొత్తం మీద ఇష్యూ సైజు రూ.9,000 కోట్ల మేర ఉంటుందని అంచనా. కనీసం 19 షేర్లకు (మార్కెట్‌ లాట్‌)దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మార్చి 16న ఈ కంపెనీ షేర్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతుంది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌ ప్రీమియమ్‌(జీఎమ్‌పీ) రూ.325/330 రేంజ్‌ లో ఉందని సమాచారం. ఫిబ్రవరి 18 వ తేదీ వరకూ ఎస్‌బీఐ షేర్లను హోల్డ్‌ చేసిన ఇన్వెస్టర్లు–రిటైల్‌ కేటగిరీలోనూ, షేర్‌ హోల్డర్ల కేటగిరీలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బీఐ ఉద్యోగులకు ఇష్యూ ధరలో రూ.75 డిస్కౌంట్‌ లభిస్తుంది. క్యూ3లో స్థూల మొండి బకాయిలు 2.47%గా ఉన్నాయని ఎస్‌బీఐ కార్డ్స్‌  సీఈఓ హర్‌దయాళ్‌ ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు