అంతా ఆ బ్యాంకే చేసింది..!

17 Sep, 2019 05:13 IST|Sakshi
ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌

స్వార్ధ ప్రైవేటు బ్యాంకు వల్లే.. ఆల్టికో సంక్షోభం

ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌

లేహ్‌: ఆల్టికో క్యాపిటల్‌లో సంక్షోభానికి ఓ ప్రైవేటు బ్యాంకు స్వార్ధపూరిత వైఖరే కారణమని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి రుణాలు సమకూర్చే బ్యాంకింగేతర ఆరి్థక సంస్థ ఆల్టికో క్యాపిటల్‌ దేశీయ బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు తాజా ఎన్‌పీఏగా మారే ప్రమాదం వచ్చి పడింది. దీనికి కారణం సదరు సంస్థ గత వారం ఈసీబీ రుణంపై రూ.20 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఓ ప్రైవేటు బ్యాంకు తన రుణాలను కాపాడుకునేందుకు ఆల్టికో ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ (ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌)ని సర్దుబాటు చేసుకుంది. దీన్ని ఏక్షపక్ష నిర్ణయంగా రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. తన సొంత డబ్బులను కాపాడుకునేందుకు అనుసరించిన ఈ చర్య విస్తృతమైన ఆరి్థక వ్యవస్థకు సమస్యలు తెచి్చపెడుతుందన్నారు.

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మొత్తంగా రూ.4,500 కోట్ల మేర ఆల్టికో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే, వడ్డీ చెల్లింపుల్లో విఫలం కావడం గత వారమే మొదటి సారి చోటు చేసుకుంది. లేహ్‌ వచి్చన సందర్భంగా దీనిపై రజనీష్‌ కుమార్‌ మీడియా సమక్షంలో స్పందించారు. ‘‘ఏదైనా బ్యాంకు స్వార్ధపూరిత వైఖరి తీసుకుంటే మిగిలిన వ్యవస్థపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రూ.50–100 కోట్ల ఎక్స్‌పోజర్‌ను మీరు తీసేసుకుని మీ డబ్బులను కాపాడుకున్నామని సంతోషపడొచ్చు. కానీ, మీరు వ్యవస్థను పాడు చేస్తే అది సరైన విధానం కాదు. పెద్ద కంపెనీల విషయంలోనూ ఓ బ్యాంకు ట్రిగ్గర్‌ నొక్కితే లేదా రుణాల సరఫరాను నిలిపివేస్తే ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది’’ అని రజనీష్‌ కుమార్‌ వివరించారు.  

సమష్టిగా వ్యవహరించాలి...
బ్యాంకర్లు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా మొత్తం ఆరి్థక వ్యవస్థను కాపాడవచ్చన్నారు రజనీష్‌ కుమార్‌. అతిపెద్ద ఎన్‌పీఏ కేసుల్లో ఇదే విధంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆల్టికో క్యాపిటల్‌ యూఏఈకి చెందిన మాష్‌రెక్‌ బ్యాంకుకు రూ.660 కోట్లు, ఎస్‌బీఐకి రూ.400 కోట్లు, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌కు రూ.200 కోట్లు, రిలయన్స్‌ నిప్పన్‌ ఏఎంసీకి రూ.150 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉందని ఇండియా రేటింగ్స్‌ నివేదిక అంచనా వేసింది. గత వారం మాష్‌రెక్‌ బ్యాంకుకు రూ.19.97 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమవడమే సంక్షోభానికి కారణం. ఈ నెల 3న ఆల్టికో రేటింగ్‌ను ఇండియా రేటింగ్స్, కేర్‌ రేటింగ్స్‌ జంక్‌ కేటగిరీకి డౌన్‌గ్రేడ్‌ చేశాయి. క్లియర్‌వాటర్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ కౌన్సిల్, వర్దే పార్ట్‌నర్స్‌ ఈ సంస్థకు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు