రుణాలపై ఎస్‌బీఐ శుభవార్త

7 Aug, 2019 16:03 IST|Sakshi

15 బేసిస్‌ పాయింట్లు  వడ్డీరేటు తగ్గించిన ఎస్‌బీఐ

సవరించిన రేట్లు ఆగస్టు 10నుంచి  వర్తింపు

తొమ్మిదేళ్ల కనిష్టానికి ఆర్‌బీఐ రెపో రేటు

సాక్షి, ముంబై : రిజర్వ్‌బ్యాంకు  ఆఫ్‌ ​ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ  దీనికనుగుణంగా స్పందించింది. అన్ని రకాల రుణాలపై 15 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.  ఈ సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు ఆగస్టు 10నుంచి అమల్లోకి  వస్తాయని బుధవారం తెలిపింది.  దీంతో  ఒక  సంవత్సర కాలపరిమితి కల రుణంపై బ్యాంకు వసూలు చేసే వడ్డీరేటు 8.40 శాతంనుంచి 8.25 శాతానికి దిగి వచ్చింది.    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  ఎస్‌బీఐ కూడా  వరుసగా  నాలుగో సారి   ఎంసీఎల్‌ఆర్‌ను కోత పెట్టినట్టయింది.

కాగా రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్షలో ఎనలిస్టులు ఊహించిన దానికంటే ఎక్కువగా  రెపో రేటుపై  అనూహ్యంగా కోత విధించిన సంగతి  తెలిసిందే. ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ బాధ్యతలను చేపట్టిన తరువాత  వరుసగా నాలుగోసారి రెపో రేటును తగ్గించడమే కాకుండా, తొలిసారిగా  35 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం విశేషం.  దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. అంతేకాదు తాజా తగ్గింపుతో ఆర్‌బీఐ రెపో  రేటు తొమ్మిదేళ్ల కనిష్టానికి చేరింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా