గృహ రుణాలపై ఎస్‌బీఐ గుడ్‌ న్యూస్‌

9 Feb, 2019 08:02 IST|Sakshi

స్వల్పంగా రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ రూ.30 లక్షల వరకు ఉన్న గృహ రుణాలపై 5 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. ఆర్‌బీఐ కీలక రేట్లను పావు శాతం తగ్గించిన మరుసటి రోజే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ ఎంపీసీ ప్రకటన నేపథ్యంలో రూ.30 లక్షల వరకు ఉన్న గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ తాము ముందు నిలిచినట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ తెలిపారు. నూతన రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయన్నారు.

గృహ రుణాల మార్కెట్‌లో అత్యధిక మార్కెట్‌ వాటా తమకు ఉందని, దీంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న దిగువ, మధ్య తరగతి వర్గాలకు రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బదిలీ చేయడానికి ఇది సరైన సమయంగా పేర్కొన్నారు. పోటీ బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ బ్యాంకు డిపాజిట్‌ రేట్లు తక్కువగా ఉన్నాయని, వీటిని ఇంకా తగ్గించాలంటే ఎంసీఎల్‌ఆర్‌ వ్యవస్థలో మొత్తం లెండింగ్‌ రేట్లను తగ్గించాల్సి ఉంటుందన్నారు.  

మరిన్ని వార్తలు