బంపర్‌ ఆఫర్‌ : 5 లీటర్ల పెట్రోలు ఉచితం

6 Dec, 2018 09:11 IST|Sakshi

ఉచిత పెట్రోల్‌ ఆఫర్‌ను పొడిగించిన ఎస్‌బీఐ

డిసెంబరు 15 తుది గడువు

 రోజుకు 10వేల మంది విన్నర్స్‌ (నిబంధనల మేరకు)

సాక్షి,ముంబై: ఉచిత పెట్రోలు ఆఫర్‌ను మరి కొన్ని రోజులు పొడిగించింది స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).  వినియోగదారులకు 5లీటర్ల దాకా ఉచిత పెట్రోల్‌ ఆఫర్ చేస్తున్న ఈ పథకం గడువు నవంబరు 23తోనే ముగిసింది. అయితే డిసెంబరు 15వరకు పొడిగించినట్టు ఎస్‌బీఐ ట్విటర్‌లో ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డు లేదా, భీమ్‌ ఎస్‌బీఐ పే ద్వారా  ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్ల పెట్రోలు కొంటే 5 లీటర్ల వరకూ పెట్రోలు పూర్తిగా ఉచితంగా పొందండి. 2018 డిసెంబర్ 15 వరకు ఈ ఆఫర్ అంటూ ట్విటర్‌  ప్రకటనలో తెలిపింది.

ఆఫర్‌ పొందాలంటే
ఇండియన్‌  ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్‌ బంకులోనైనా కనీసం 100 రూపాయల విలువైన పెట్రోలు కొనుగోలు చేయాలి.  2018 ఏప్రిల్ 1నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న భారత పౌరులకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఒక కస్టమర్ రిపీట్ కొనుగోళ్లకు పలు ఎంట్రీలను  పంపంవచ్చు.  అయితే ప‍్రతీ ఎస్‌ఎంఎస్‌కు డిఫరెంట్‌ కోడ్‌ ఉండాలి.


ఆఫర్ పొందేందుకు అనుసరించాల్సిన విధానం
ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ల నుండి రూ. 100 విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేయాలి. అదీ భీమ్‌, ఎస్‌బీఐకార్డు  ద్వారా చెల్లింపులకు మాత్రమే.
► 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెలఅధికార కోడ్‌ను 9222222084కు  సెండ్‌ చేయాలి.
► భీమ్‌  ద్వారా చెల్లిస్తే 12 అంకెల రిఫరెన్స్ కోడ్‌ , ఎస్‌బీఐ కార్డుల ద్వారా చెల్లింపుల విషయంలో 6అంకెల  కోడ్‌ను నిర్దేశిత నంబరుకు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి ఉంటుంది.

అంతేకాదు ఇలా అందిన ఎస్‌ఎంఎస్‌లలో ఎంపికచేసిన దానికి  50, 100, 150, 200 రూపాయలు స్పెషల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. ప్రచార కాలంలో ఒక మొబైల్ నంబర్ గరిష్టంగా రెండు సార్లు ఈ ఆఫర్‌ పొందే అవకాశం. ఆఫర్‌ ముగిసిన రెండువారాల్లో విజేతలను ప్రకటిస్తారు.  ఈ నగదును ఇండియన్ ఆయిల్  లాయల్టీ  ప్రోగ్రాంలో రీడీమ్ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు