ఎస్‌బీఐ పండగ ఆఫర్లు

15 Oct, 2018 01:58 IST|Sakshi

యోనో యాప్‌తో షాపింగ్‌ చేస్తే డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పండగ సీజన్‌ సందర్భంగా తమ ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. తమ యోనో (యూ ఓన్లీ నీడ్‌ వన్‌) యాప్‌ ద్వారా షాపింగ్‌ చేసినవారికి అదనంగా డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌ అందిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్‌ 16–21 మధ్యలో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్‌ కార్డులతో యోనో యాప్‌ ద్వారా షాపింగ్‌ చేస్తే 10% దాకా డిస్కౌంటు, క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. ఈ–కామర్స్‌ సైట్లు ఇచ్చే డిస్కౌంట్లకు ఇవి అదనం.

‘టాప్‌ 14 ఈ–కామర్స్‌ సంస్థలు .. ఫ్యాషన్‌ నుంచి ఫర్నిచర్‌ దాకా పలు ఉత్పత్తులపై సాధారణంగా 50% దాకా డిస్కౌంట్‌ ఇస్తున్నాయి. యోనో షాపింగ్‌ ఫెస్టివల్‌ (వైఎస్‌ఎఫ్‌)లో  భాగంగా మా యాప్‌ ద్వారా ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్‌ కార్డులతో డిజిటల్‌ షాపింగ్‌ చేస్తే 10% దాకా డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌ అందిస్తున్నాం’ అని ఎస్‌బీఐ ఎండీ పి.కె. గుప్తా వెల్లడించారు.

ఎస్‌బీఐ కస్టమర్లందరికీ ఫైనాన్సింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంటుందని ఆయన వివరించారు. అమెజాన్, జబాంగ్, మింత్రా, కల్యాణ్‌ జ్యువెలర్స్, క్యారట్‌లేన్, పీసీజే, పెపర్‌ఫ్రై, ఓయో, టాటా క్లిక్, యాత్రా, ఫస్ట్‌క్రై, ఈజ్‌మైట్రిప్, ఐజీపీ, ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్‌ సంస్థలతో వైఎస్‌ఎఫ్‌లో భాగంగా ఎస్‌బీఐ ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

సుజుకి జిక్సెర్‌ కొత్త బైక్‌..

పది విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ

150 పాయింట్ల లాభం : 11600 పైకి నిఫ్టీ

హోండా ‘డబ్ల్యూఆర్‌–వీ’ కొత్త వేరియంట్‌

గూగుల్‌ మ్యాప్స్‌లో డైనింగ్‌ ఆఫర్లు

మెహుల్‌ చోక్సీ ఆస్తులు ఈడీ జప్తు

రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఓకే

రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటాం

భూముల అమ్మకంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఊపిరి!

ఎయిరిండియాను అమ్మేసినా దేశీ సంస్థల చేతుల్లోనే

కళ్యాణి రఫేల్‌కు భారీ కాంట్రాక్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా