రుణగ్రహీతలకు ఎస్‌బీఐ షాక్‌

11 Dec, 2018 08:12 IST|Sakshi

ఎస్‌బీఐ వడ్డీరేట్లు పెంపు

గృహ, వాహన రుణాలు మరింత ప్రియం

వినియోగదారుల నెత్తిన ఈఎంఐ భారం

సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  తద్వారా రుణ గ్రహీతలపై భారీ భారాన్ని మోపనుంది. ఎస్‌బీఐ  తన బెంచ్‌మార్క్‌ వడ్డీరేట్లను 0.05శాతం లేదా 5 బేసిస్‌ పాయింట్లను  పెంచింది. 

ఈ సవరించిన వడ్డీరేట్లు  సోమవారం (డిసెంబరు 10) నుంచి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా  ఏడాదిపరిమితి గల రుణాలపై వడ్డీరేటును 8.50  నుంచి 8.55కి పెరగగా, 2-3  సంవత్సరాల  పరిమితి రుణాలపై  వరుసగా 8.66 శాతంనుంచి 8.65 కి, 8.70 శాతంనుంచి 8.75 పెరుగుతాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

అన్ని రకాల రుణాలపై స్టాండర్డ్ గా 0.5 శాతం వడ్డీ రేట్లు పెంచింది.  అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ, వాహన, రుణాలు, రీటెయిల్ట్ పర్సనల్ లోన్లు మరింత ప్రియం కానున్నాయి.

మరిన్ని వార్తలు