ఎస్‌బీఐ కస్టమర్లకు చాట్‌బోట్‌

25 Sep, 2017 18:33 IST|Sakshi

సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా తన కస్టమర్ల కోసం ఓ చాట్‌బోట్‌ను లాంచ్‌చేసింది. ఎస్‌బీఐ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారితంగా రూపొందించిన ఎస్‌బీఐ ఇంటెలిజెంట్‌ అసిస్టెంట్‌ లేదా ఎస్‌ఐఏ అనే చాట్‌ అసిస్టెంట్‌ను లాంచ్‌ చేసినట్టు ఏఐ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ పేజో తెలిపింది. ఈ చాట్ అసిస్టెంట్‌ బ్యాంకింగ్‌ ప్రతినిధి లాగా ప్రతిరోజూ బ్యాంకింగ్‌కు సంబంధించిన లావాదేవీల్లో కస్టమర్లకు సహకరించిందని కంపెనీ తెలిపింది. 

బ్యాంకింగ్‌ ఇండస్ట్రీలో ఎస్‌ఐఏ ఓ విప్లవమని పేజో ఫౌండర్‌, సీఈవో శ్రీనివాస నిజయ్‌ అన్నారు. సెకనుకు 10 వేల ఎంక్వయిరీలను, రోజుకు 864 మిలియన్ల ఎంక్వయిరీలను ఇది పరిష్కరిస్తుందని చెప్పారు. ఎస్‌ఐఏ కస్టమర్‌ సర్వీసుల నాణ్యతను పెంచుతుందని ఎస్‌బీఐ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ శివ్‌ కుమార్‌ బాసిన్‌ చెప్పారు. బ్యాంకింగ్‌ డొమైన్‌లో అత్యంత నిపుణి అయిన పేజో, తమకు ఎస్‌ఐఏ అభివృద్ధి చేయడంలో ఎంతో సహకరించిందని తెలిపారు. నిర్వహణ వ్యయాలను ఎస్‌ఐఏ తగ్గిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్‌ ఉత్పత్తుల, సర్వీసుల ఎంక్వయిరీలను ఎస్‌ఐఏ పరిష్కరిస్తోంది. 

మరిన్ని వార్తలు