ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లాభం11% అప్‌

20 Oct, 2018 01:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 11 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.225 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.251 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. స్థూల ప్రీమియమ్‌ ఆదాయం రూ.5,460 కోట్ల నుంచి రూ.7,685 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో     బీఎస్‌ఈలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్‌ 0.1 శాతం నష్టంతో రూ.561 వద్ద ముగిసింది.

ఎంఫసిస్‌ లాభం 37 శాతం అప్‌..
ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 37 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.198 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.271 కోట్లకు పెరిగిందని ఎంఫసిస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,642 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.1,962 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎంఫసిస్‌ షేర్‌ 4.2 శాతం నష్టంతో రూ.1,075 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు