రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

11 Mar, 2020 12:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రుణాలపై వడ్డీరేట్లను ఎస్‌బీఐ 15 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. వివిధ కాలపరిమితితో కూడిన రుణాలపై నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్‌ఆర్‌)లో కోత విధించింది. ఏడాది కాల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 7.85 శాతం నుంచి 7.75 శాతానికి, ఓవర్‌నైట్‌, ఒక నెల కాలపరిమితి కలిగిన రుణ రేట‍్లను 7.45 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఇది వరుసగా పదోసారి కావడం గమనార్హం. మూడు నెలల కాలపరిమితి కలిగిన రుణ రేటును 7.65 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. మూడేళ్ల కాలానికి రుణ రేట్లను 8.05 శాతం నుంచి 7.95 శాతానికి కుదించింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం సోమవారం ఎంసీఎల్‌ఆర్‌ను అన్ని కాలపరిమితి కలిగిన రుణాలపై 10 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది.

చదవండి : ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం కాదు: రజనీష్‌

మరిన్ని వార్తలు