లాభాల్లోకి ఎస్‌బీఐ, కానీ అంచనాలు మిస్‌

2 Aug, 2019 14:32 IST|Sakshi

తగ్గిన  బ్యాడ్‌లోన్‌ బెడద లాభాల్లోకి  ఎస్‌బీఐ

క్యూ1 లో  రూ. 2312 కోట్ల నికర లాభాలు

సాక్షి, ముంబై :  ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌దిగ్గజం క్యూ1 ఫలితాల్లో మెరుగైన లాభాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.2312కోట్ల నికర లాభాలను సాధించింది.గత ఏడాది నష్టాలతో పోలిస్తే ప్రధానంగా అధిక ఆదాయం, చెడు రుణాల తగ్గింపుతో ఈ ఫలితాలను సాధించినట్టు బ్యాంకు  తెలిపింది.  2018-19 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ 4,876 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. స్వతంత్ర మొత్తం ఆదాయం 2019-20 మొదటి త్రైమాసికంలో రూ .70,653 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ .65,493 కోట్లుగా ఉంది.  అయితే  4,106 కోట్ల లాభాలను సాధించనుందన్న ఎనలిస్టుల అంచనాలను అందుకోలేకపోయింది. 

నికర వడ్డీ, ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే  5.23 శాతం పెరిగిందని ఎస్‌బీఐ రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. ప్రొవిజన్లు 11 శాతం తగ్గి రూ. 11648 కోట్లుగా ఉన్నాయి. ఎసెట్‌ క్వాలిటి జూన్ త్రైమాసికంలో స్థిరంగా ఉంది. నికర ఎన్‌పిఎలు  3.07 శాతానికి తగ్గాయి. ఏడాది క్రితం ఇది 5.29 శాతంగా ఉంది. ఆస్తులతో పోల్చితే దాని స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పిఎ) జూన్ చివరినాటికి 7.53 శాతానికి తగ్గింది, గత ఏడాది జూన్ చివరినాటికి ఇది 10.69 శాతానికి పైగా ఉంది. ఈ ఫలితాల  నేపథ్యంలో ఎస్‌బీఐ బ్యాంకు లాభాలతో కొనసాగుతోంది.

>
మరిన్ని వార్తలు