వడ్డీ రేటు తగ్గిస్తున్న బ్యాంకులు

11 Jul, 2019 04:40 IST|Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌  పిలుపునకు స్పందన

రుణ రేటు 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఎస్‌బీఐ

అదే బాటలో ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌

10 బేసిస్‌ పాయింట్ల రుణ రేటు కోత

తక్షణం కొత్త రేట్లు అమల్లోకి... 

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందిస్తున్న రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు వేగంగా బదలాయించాలన్న గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటనకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) స్పందించాయి. రుణ రేటును స్వల్పంగా తగ్గించాయి. ఈ విషయంలో ఎస్‌బీఐ 5 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తే, ఓబీసీ 10 బేసిస్‌ పాయింట్ల రేటును తగ్గించింది. 100 బేసిస్‌ పాయింట్లంటే ఒక శాతం. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటే రెపో. ప్రస్తుతం ఈ రేటు 5.75 శాతంగా ఉంది.  

ఆర్‌బీఐ గవర్నర్‌ ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం నాడు జరిగిన బడ్జెట్‌ అనంతర సంప్రదాయక సమావేశం సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మాట్లాడుతూ, ‘‘జూన్‌ 6వ తేదీకి ముందు పాలసీ నిర్ణయం వరకూ చూస్తే, రెపో రేటు 50 బేసిస్‌ పాయింట్లు తగ్గింది (నాటి నిర్ణయం కూడా కలుపుకుంటే 75 బేసిస్‌ పాయింట్లు). అయితే బ్యాంకర్లు మాత్రం ఇందులో కేవలం 21 బేసిస్‌ పాయింట్ల రేటును కస్టమర్లకు బదలాయించారు. ఈ విధానం మారాలి. వేగంగా రెపో ప్రయోజనం కస్టమర్‌కు అందాలి. వృద్ధికి ఇది అవసరం. ఏది ఏమైనా ఇప్పుడు ఒక సానుకూల అంశం ఉంది. రేటు బదలాయింపునకు ఇంతక్రితం ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు రెండు, మూడు నెలల సమయం మాత్రమే పడుతోంది’’ అని అన్నారు.

ఎస్‌బీఐ.. ఆర్థిక సంవత్సరంలో మూడవసారి
► ఎస్‌బీఐ తగ్గించిన తాజా ఐదు బేసిస్‌ పాయింట్ల రుణ రేటు తగ్గింపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ మూడుసార్లు రుణ రేటును తగ్గించింది. ఇంతక్రితం ఏప్రిల్, మే నెలల్లో కూడా ఎస్‌బీఐ రుణ రేటు ఐదు బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. మొత్తంగా ఈ కాలంలో గృహ రుణాలపై ఎస్‌బీఐ వడ్డీరేటు 20 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గింది.  అయితే ఇది ఆర్‌బీఐ తగ్గించిన రెపో రేటుకన్నా తక్కువగా ఉండడం గమనార్హం.
► నిధుల సమీకరణ వ్యయభారం ప్రాతిపదికన ఉండే మార్జినల్‌ కాస్ట్‌ లెండింగ్‌ రేటు (ఎంసీ ఎల్‌ఆర్‌) ప్రస్తుతం 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గింది.  
► జూలై 1 నుంచే బ్యాంక్‌ రెపో ఆధారిత గృహరుణ పథకాలను ప్రవేశపెట్టింది.  

ఇప్పటికే కొన్ని బ్యాంకులు..
జూన్‌ 6 పాలసీ సమీక్ష, పావుశాతం రేటు కోత అనంతరం బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కార్పొరేషన్‌ బ్యాంక్, ఓరియెంటల్‌ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లు కూడా తమ ఎంసీఎల్‌ఆర్‌ను 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించాయి.  

మరో రేటు కోత!
ఆగస్టు 5  నుంచి 9వ తేదీల మధ్య ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తాజా విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా వృద్ధే లక్ష్యంగా మరో పావుశాతం రెపో రేటు కోత ఉంటుందని అంచనా. ఇదే జరిగితే, రెపో రేటు 5.5 శాతానికి తగ్గుతుంది.  ఇది ఆరు సంవత్సరాల గరిష్టస్థాయి. పారిశ్రామిక రంగం ఊపునకు సైతం రేటు తగ్గింపు తప్పనిసరన్న డిమాండ్‌  ఉంది.

నేటి నుంచే తగ్గిన ఓబీసీ రేటు అమలు
వివిధ కాలపరిమితుల రుణ రేట్లను ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) 10 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించింది. తాజా రేట్లు గురువారం నుంచే అమల్లోకి వస్తాయి. బ్యాంక్‌ తాజా  నిర్ణయం ప్రకారం– ఓవర్‌నైట్, నెల ఎంసీఎల్‌ఆర్‌ 10 బేసిస్‌ పాయింట్ల చొప్పున తగ్గి 8.20 శాతం, 8.25 శాతానికి తగ్గాయి. అలాగే మూడు, ఆరు, ఏడాది రేట్లు ఐదు బేసిస్‌ పాయింట్లు తగ్గి 8.45 శాతం, 8.55 శాతం, 8.65 శాతాలకు దిగివచ్చాయి.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!