ఎస్‌బీఐ బేస్‌ రేటు కోత

29 Sep, 2017 14:54 IST|Sakshi

others cuttheir

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)  ఖాతాదారులకు పండుగ  శుభవార్త అందించింది.  బేస్‌ రేటులో  5 బేసిస్‌ పాయింట్లమేర కోత పెట్టింది. ఇప్పటివరకు 9శాతంగా ఉన్న బేస్‌టు తాజా తగ్గింపుతో  ప్రస్తుతం ఎస్‌బీఐ బేస్‌ రేటు 8.95 శాతానికి చేరింది. ఈ నిర్ణయంతో ఏప్రిల్ 2016కు  ముందు హౌస్‌లోన్‌ తీసుకున్నవారికి  లబ్ధి చేకూరనుంది.  ఈ రేట్లు అక్టోబర్‌ 1 నుంచి అమలుకానున్నాయని ఎస్‌బీఐ  ప్రకటించింది.  అయితే ఎంసీఎల్‌ఆర్‌ రేటు ఎలాంటి మార్పులేదు.

అక్టోబర్‌ నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో ఎస్‌బీఐ చర్యకు ప్రాధాన్యత ఏర్పడినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి.  ఈ రివ్యూలో బేస్‌రేటులోకోత పెడుతుందనే అంచనాలు మార్కెట్‌ వర్గాల్లో  నెలకొన్నాయి. అయితే మైక్రో ఎకానమిక్‌ డాటా ఆధారంగా రేట్‌ ఉండకపోవచ్చని ఎస్‌బీఐ అభిప్రాయపడింది.

కాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆంధ్రా బ్యాంకు బేస్‌ రేటులో కోతలను అమలు చేశాయి.  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బేస్‌ రేటును 35 బేసిస్‌ పాయింట్లమేర కుదించి 9.15 శాతానికి తగ్గించింది. ఈ బాటలో ఆంధ్రా బ్యాంకు సైతం 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించి బేస్‌ రేటును 9.55 శాతంగా ప్రకటించింది. బ్యాంకులు బేస్‌ రేటు ఆధారంగా రుణాల మంజూరీని చేపట్టే విషయం విదితమే.
 

మరిన్ని వార్తలు