ఉద్యోగుల వస్త్రధారణపై గైడ్‌లైన్స్‌

11 Jan, 2018 19:21 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తన ఉద్యోగులకు కొత్తగా డ్రస్‌ కోడ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు ధరించే దుస్తులపై గైడ్‌లైన్స్‌ జారీచేస్తూ 2018 జనవరి 6న ఓ సర్క్యూలర్‌ పంపింది. వర్క్ ప్లేస్‌లో అందరూ అంగీకరించే, ఆమోదించే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగి వస్త్రధారణ ఉండాలని తెలిపింది. ఈ మోడల్‌ డ్రస్‌ కోడ్‌కు ఉద్యోగులందరూ కట్టుబడి ఉండాలని తెలిపింది. మగవాళ్లు స్మార్ట్ పార్మల్స్ లో, ఆడవాళ్లు పార్మల్ ఇండియన్ లేదా వెస్ట్రన్ డ్రస్‌ల్లో రావాలని సూచించింది. మొత్తం బ్యాంకు శాఖలు 24వేలు ఉండగా.. వాటిలో 2.69 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ స్టాప్‌కు, ఇతర  అడ్మినిస్ట్రేటివ్‌, బ్రాంచ్‌ లెవల్‌ స్టాఫ్‌కు ప్రత్యేక డ్రస్‌ కోడ్‌లను ప్రకటించింది. వ్యక్తిగత పరిశుభ్రతను ఉద్యోగులు కలిగి ఉండాలని, అశుభ్రమైన లుక్‌ను విడిచిపెట్టాలని బ్యాంకు తన ఉద్యోగులను ఆదేశించింది. ఎవరూ టీ షర్ట్, జీన్స్, స్పోర్ట్ షూస్, షార్ట్స్, త్రీ పోర్త్ ధరించి ఆఫీసుకి రావొద్దని సూచించింది.  సాలిడ్ కలర్ షర్ట్‌పై ప్రింటింగ్ ఉన్న టై, చెక్ షర్ట్‌పై సాధారణమైన టై ధరించాలని తెలిపింది. అందరూ షూస్ వేసుకునే ఆఫీసుకు రావాలని, చెప్పులు వేసుకుని ఆఫీసుకు రాకూడదని తెలిపింది.

మరిన్ని వార్తలు