అదరగొట్టిన ఎస్‌బీఐ 

31 Jan, 2020 14:07 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ  దిగ్గజ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఫలితాల్లోఅదరగొట్టింది.   అక్టోబర్-డిసెంబర్ తో ముగిసిన క్యూ3లో అంచనాలకు మించిన ఫలితాలను క్యూ3లో  41 శాతం ఎగిసి రూ.5583 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది.  గత ఏడాది ఇదేకాలంలో రూ.3955 కోట్ల లాభాలను సాధించింది.  అక్టోబర్-డిసెంబర్ 2018-19లో రూ .84,390.14 కోట్ల నుంచి మూడో త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ .95,384.28 కోట్లకు పెరిగిందని ఎస్‌బిఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మొత్తం ఆదాయం  రూ. 76,798 కోట్లను సాధించింది. ఎసెట్‌ క్వాలిటీ బాగా పుంజుకుంది. మొత్తం త్రైమాసికంలో బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 7.9 శాతం నుంచి 6.94 శాతానికి మెరుగుపడ్డాయి. ఈ ఫలితాలతో  ఎస్‌బీఐ షేరు 3 శాతం లాభాలతో కొనసాగుతోంది. 

>
మరిన్ని వార్తలు