దీర్ఘకాలానికి నిలకడైన రాబడులు

16 Sep, 2019 05:06 IST|Sakshi

ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ గడిచిన 6–12 నెలల కాలంలో గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. అధిక రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లకు ఇది మంచి పెట్టుబడి అవకాశాలను తీసుకొచి్చంది. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు మంచి పనితీరు కలిగిన స్మాల్‌క్యాప్‌ పథకాల్లో ఈ తరుణంలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మంచి రాబడులు పొందేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ విభాగంలో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ పథకం కూడా మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో ఒకటి.  

పనితీరు..: అన్ని కాలాల్లోనూ ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ పథకం బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీతో పోలిస్తే మంచి పనితీరు చూపించడం ఇన్వెస్టర్లు తప్పకుండా గమనించాల్సిన అంశం. ఏడాది కాలంలో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ పథకంలో నికరంగా 12 శాతం నష్టాలు ఉన్నాయి. కానీ, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ ఇదే కాలంలో ఏకంగా 24 శాతానికి పైగా నష్టపోయింది. అంటే గత ఏడాది కాలంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉండడం పనితీరుపై ప్రభావం చూపించింది. అయినప్పటికీ ఈ ఫండ్‌ మేనేజర్లు నష్టాలను తగ్గించగలిగారు.

ఇక మూడేళ్ల కాలంలో ఎస్‌బీఐ స్మాల్‌ క్యాప్‌ పథకం వార్షికంగా 10.25 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 16.58 శాతం చొప్పున రిటర్నులు ఇచి్చంది. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ సూచీ మూడేళ్లలో అసలు రాబడులనే ఇవ్వకుండా ఫ్లాట్‌గా ఉంది. ఐదేళ్ల కాలంలో కేవలం 4.35 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. మూడేళ్లు, ఐదేళ్ల కాలాల్లోనూ బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ సూచీ అందుకోలేని పనితీరు ఈ పథకంలో చూడొచ్చు. స్మాల్‌క్యాప్‌ విభాగంలో పోటీ పథకాలు హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్‌క్యాప్, రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ పథకాలను మించి అన్ని కాలాల్లోనూ ఎస్‌బీఐస్మా ల్‌ క్యాప్‌ ఉత్తమ పనితీరు చూపించడం గమనార్హం.

పెట్టుబడుల విధానం
2011, 2013, 2018 మార్కెట్‌ కరెక్షన్లలో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ పథకం నష్టాలను తగ్గించింది. ఇక ప్రస్తుత ప్రతికూల సమయంలోనూ ఈ పథకం పనితీరు మెచ్చుకోతగ్గదే. అంతేకాదు 2014, 2017 బుల్‌ ర్యాలీల్లోనూ మంచి పనితీరు చూపించింది. మొత్తం పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. మిగిలిన పెట్టుబడులను లార్జ్, మిడ్‌క్యాప్‌ కంపెనీలకు కేటాయిస్తుంది. అలాగే, డెట్‌కు కూడా కొంత కేటాయిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం పెట్టుబడులను గమనించినట్టయితే స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో 72 శాతం మేర ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో 22 శాతం, లార్జ్‌క్యాప్‌లో 3.51 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 5 శాతం వరకు ఉండడం గమనార్హం. ఇక ఇంజనీరింగ్, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచి్చంది. 45 శాతం పెట్టుబడులు ఈ రంగాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్, టెక్స్‌టైల్స్, సర్వీసెస్‌ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది.

మరిన్ని వార్తలు