క్యాబ్‌లు, అద్దె కార్లకే మొగ్గు! ఎస్‌బీఐ చైర్మన్‌ విశ్లేషణ

22 Aug, 2019 10:23 IST|Sakshi

జైపూర్‌: డిజిటల్‌ లావాదేవీలను గణనీయంగా పెంచే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘యోనో’ క్యాష్‌ పాయింట్ల సంఖ్యను పెంచనున్నట్లు బ్యాంక్‌ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం 70,000 క్యాష్‌ పాయింట్లు ఉండగా.. వీటి సంఖ్యను వచ్చే 18 నెలల్లో 10 లక్షలకు చేర్చనున్నామని వెల్లడించారు. డిజిటల్‌ చెల్లింపుల వినియోగం పెరిగే చర్యలు తీసుకోవడం వల్ల డెబిట్‌ కార్డు వాడకం తగ్గిపోతుందని, కార్డుల జారీని నిలిపివేసే యోచన తమకు లేదని స్పష్టంచేశారు. ఆటోరంగ మందగమనంపై మాట్లాడిన ఆయన.. ‘ఉద్యోగాల్లో అనిశ్చితి కారణంగా వినియోగదారులు సొంత కార్లను కొనుగోలు చేయడం కంటే.. క్యాబ్‌లు, అద్దెకార్లకే మొగ్గుచూపుతున్నారు. ఈ ప్రభావం ఎంత మేర ఉందనే విషయాన్ని పరిశీలించాలి’ అని విశ్లేషించారు.

మరిన్ని వార్తలు