ఎల్‌ఐసీ ఐపీఓ మంచిదే: ఐఆర్‌డీఏఐ చైర్మన్‌

19 Feb, 2020 07:51 IST|Sakshi

ముంబై: ఎల్‌ఐసీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు సంబంధించిన ప్రతిపాదన ఏదీ  ప్రస్తుతానికైతే తమ వద్దకు రాలేదని బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్‌డీఏఐ తెలిపింది. పారదర్శకత, ఇతర అంశాల దృష్ట్యా చూస్తే, ఎల్‌ఐసీ ఐపీఓకు  రావడం మంచి ప్రయత్నమేనని ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ ఎస్‌.సి. కుంతియా పేర్కొన్నారు. అసలు ప్రతీ బీమా కంపెనీ కూడా స్టాక్‌ మార్కెట్లో లిస్టయితే మంచిదని వివరించారు. బీమా పాలసీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపులు  వచ్చేవని, అయితే తాజా బడ్జెట్‌లో ఈ మినహాయింపులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీమా సంస్థలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. కొంత కాలం ఈ మినహాయింపులు లభిస్తాయని పేర్కొన్నారు. నష్టాలు వచ్చే పాలసీలను పక్కనబెట్టి, లాభాలు వచ్చే పాలసీలపై బీమా కంపెనీలు దృష్టి సారించాలని కుంతియా పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు