కేంద్రం, రాన్‌బాక్సీలకు సుప్రీం నోటీసులు

15 Mar, 2014 01:33 IST|Sakshi

 న్యూఢిల్లీ: కలుషిత ఔషధాలను సరఫరా చేస్తున్న రాన్‌బాక్సీ లాబొరేటరీస్ లెసైన్సును రద్దుచేసి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజం (పిల్) మేరకు కంపెనీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.  అయితే, ఔషధాలను తయారు చేయకుండా రాన్‌బాక్సీకి తాత్కాలిక ఉత్తర్వులివ్వాలన్న విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ పి.సదాశివం సారథ్యంలోని బెంచ్ శుక్రవారం తోసిపుచ్చింది.  ఎంఎల్ శర్మ అనే అడ్వొకేట్ ఈ పిల్ దాఖలు చేశారు.

 కలుషిత ఔషధాలు తయారుచేసి, విక్రయిస్తున్నందుకు రాన్‌బాక్సీపై 50 కోట్ల డాలర్ల జరిమానాను అమెరికా ఆహార, ఔషధ సంస్థ (యుఎస్‌ఎఫ్‌డీఏ) విధించిందని పిటిషనర్ తెలిపారు.  అమెరికాలో కలుషిత ఔషధాలు సరఫరా చేశామంటూ రాన్‌బాక్సీ తప్పు ఒప్పుకున్నప్పటికీ, కంపెనీపై భారీ మొత్తంలో జరిమానా విధించినప్పటికీ భారత్‌లో ఆ కంపెనీ ఉత్పత్తుల నిషేధానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య లూ చేపట్టలేదని పేర్కొన్నారు.  కాగా దేశీయ మార్కె ట్లో తాము విక్రయిస్తున్న ఔషధాలన్నీ సురక్షితమైనవి, ప్రభావవంతమైనవేనని రాన్‌బాక్సీ స్పష్టం చేసింది.
 

మరిన్ని వార్తలు