కార్వీపై ఏడాది నిషేధం

16 Jun, 2015 02:00 IST|Sakshi
కార్వీపై ఏడాది నిషేధం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ను ఐపీవో స్కాం వీడటం లేదు. ఏడాది పాటు కొత్తగా ఎటువంటి ఐపీవోలు చేపట్టకుండా కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధించింది. 2003-05లో జరిగిన ఐపీవో స్కాం కేసుకు సంబంధించి సెబీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సోమవారం నుంచి ఏడాది పాటు ఐపీవోలకు సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష కార్యకలాపాల నుంచి కేఎస్‌బీఎల్‌ని నిషేధించింది. కానీ ఈ తీర్పు వెలువడేలోగా తీసుకున్న ఐపీవోలను చేపట్టవచ్చని సెబీ స్పష్టం చేసింది. ఈ ఐపీవో స్కాంకు సంబంధించి మార్చి, 2014లో సెబీ కేఎస్‌బీఎల్‌ను ఆరు నెలల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కార్వీ సెక్యూరిటీస్ అప్పలెట్ ట్రిబ్యునల్‌ను (శాట్)ను ఆశ్రయించగా ఈ కేసులో కార్వీ వాదనలతో పాటు, అహ్మదాబాద్ భారత్ ఓవర్సీస్ బ్రాంచ్ మేనేజర్‌ని విచారించి నాలుగు నెలల్లోగా తుది ఉత్తర్వులను జారీ చేయాలని ఆదేశించింది. విచారణ అనంతరం ఏడాది పాటు కొత్త ఐపీవోలను చేపట్టరాదని సెబీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు