పీఏసీఎల్ కేసులో సెబీ కమిటీ...

18 Feb, 2016 01:41 IST|Sakshi
పీఏసీఎల్ కేసులో సెబీ కమిటీ...

న్యూఢిల్లీ: పీఏసీఎల్ (పెరల్ ఆగ్రో) స్థలాలను విక్రయించి ఇన్వెస్టర్ల సొమ్ము వాపసు చేసే దిశగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మాజీ చీఫ్ జస్టిస్ ఆర్‌ఎం లోధా సారథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సెబీ హోల్ టైమ్ సభ్యుడు ఎస్ రామన్, చీఫ్ మేనేజర్ అమిత్ ప్రధాన్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. డిప్యుటీ జీఎం రాకేశ్ కుమార్ సింగ్ నోడల్ ఆఫీసరుగా వ్యవహరిస్తారని, స్థలాల విక్రయం ద్వారా సమీకరించే నిధులకు ఆయన ఇన్‌చార్జిగా ఉంటారని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది.

18 ఏళ్లలో వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట ఉమ్మడి పెట్టుబడి పథకాల ద్వారా పీఏసీఎల్ దాదాపు రూ. 49,100 కోట్లు మోసపూరితంగా సమీకరించిందని సెబీ తేల్చింది. పీఏసీఎల్, దాని ప్రమోటర్లు, డెరైక్టర్ల నుంచి ఈ డబ్బును రాబట్టడానికి చర్యలు చేపట్టింది. అసలు, వడ్డీ కలిపి పీఏసీఎల్, మరో అనుబంధ సంస్థ పీజీఎఫ్‌ఎల్ దాదాపు అయిదు కోట్ల పైగా ఇన్వెస్టర్లకు రూ.60,000 కోట్ల పైగా మొత్తాలు చెల్లించాల్సి ఉంటుందని అంచనా.
 

మరిన్ని వార్తలు