రూ.625 కోట్లు చెల్లించండి

1 May, 2019 00:19 IST|Sakshi

కో–లొకేషన్‌ కేసులో ఎన్‌ఎస్‌ఈకి సెబీ ఆదేశాలు

2014 ఏప్రిల్‌ నుంచి వడ్డీతో సహా చెల్లించాలి

ఇద్దరు మాజీ చీఫ్‌లపై ఐదేళ్లు నిషేధం కూడా

న్యూఢిల్లీ: ట్రేడింగ్‌ సమాచారం కొందరికి అందరికన్నా ముందుగా లభ్యమయ్యే అవకాశం కల్పించిన కోలొకేషన్‌ కేసులో... రూ.625 కోట్లు పరిహారంగా చెల్లించాలంటూ నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీని (ఎన్‌ఎస్‌ఈ) సెబీ ఆదేశించింది. ఎన్‌ఎస్‌ఈకి లోగడ ఎండీగా పనిచేసిన రవి నారాయణ్, సీఈవోగా వ్యవహరించిన చిత్రా రామకృష్ణలను తమ పదవీ కాలంలో పొందిన వేతనంలో 25 శాతాన్ని తిరిగి చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వీరికి ఏ లిస్టెడ్‌ కంపెనీతోనూ లేదా మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ముడిపడిన సంస్థతోనూ లేదా మార్కెట్‌ ఇంటర్‌ మీడియరీతో ఐదేళ్ల పాటు సంబంధాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఆరు నెలల పాటు సెక్యూరిటీల మార్కెట్‌లోకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రవేశించకుండా ఎన్‌ఎస్‌ఈని నిషేధించింది. అంతేకాకుండా తరచుగా తన వ్యవస్థలను ఆడిట్‌ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సెబీ 104 పేజీలతో కూడిన ఆదేశాలను మంగళవారం జారీ చేసింది. ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్‌ కింద కొందరికి అధిక ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌ సదుపాయాలను కల్పించిందంటూ 2015లో దాఖలైన ఫిర్యాదుపై సెబీ దర్యాప్తు నిర్వహించిన విషయం గమనార్హం. 

14 మందికి విముక్తి..: కో–లొకేషన్‌ కింద జరిగిన డేటా సరఫరాతో ఆర్జించిన లాభాల నుంచి రూ.625 కోట్లను చెల్లించడంతో పాటు, దీనికి 2014 ఏప్రిల్‌ 1 నుంచి 12% వడ్డీని సైతం చెల్లించాలని ఎన్‌ఎస్‌ఈని సెబీ ఆదేశించింది. ఈ మొత్తాన్ని పెట్టుబడిదారుల రక్షణ, విద్యా కార్యక్రమ నిధికి జమ చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసులో సెబీ మొత్తం 16 మందికి షోకాజు నోటీసులు జారీ చేయగా, వీరిలో 14 మందికి విముక్తి లభించింది. ‘‘ఎన్‌ఎస్‌ఈ మోసపూరిత, అనుచిత విధానాలకు పాల్పడడం ద్వారా సెబీ నియంత్రణలను ఉల్లంఘించింది. టిక్‌ బై టిక్‌ (టీబీటీ) డేటా ఆర్కిటెక్చర్‌ను ఏర్పాటు చేసే విషయంలో ఎన్‌ఎస్‌ఈ తగినంత శ్రద్ధ వహించలేదన్నది సుస్పష్టం. దీని కారణంగా ఏర్పడిన ట్రేడింగ్‌ వాతావరణంలో జరిగిన సమాచార వ్యాప్తి అసమానం. దీన్ని పారదర్శకం, సమానత్వంగా పరిగణించడానికి లేదు’’ అని సెబీ పూర్తిస్థాయి సభ్యుడు జి మహాలింగం ఆదేశాల్లో పేర్కొన్నారు. మార్కెట్‌ సదుపాయాల సంస్థ అయిన ఎన్‌ఎస్‌ఈని ఇతర మార్కెట్‌ మధ్యవర్తిత్వ సంస్థలు, పార్టిసిపెంట్స్‌తో సమానంగా చూడరాదన్నారు. టీబీటీ డేటా వ్యాప్తి అన్నది 2010 జూన్‌ నుంచి 2014 మార్చి వరకు జరిగినట్టు సెబీ గుర్తించింది. కాగా, సెబీ ఆదేశాలను పరిశీలించి, న్యాయపరంగా వీలుంటే తదుపరి చర్యలు చేపడతామని ఎన్‌ఎస్‌ఈ అధికార ప్రతినిధి చెప్పారు.

►ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ రవి నారాయణ్, మాజీ సీఈవో చిత్రా రామకృష్ణలపై ఐదేళ్ల పాటు నిషేధం 
►రూ.625 కోట్లను 12% వడ్డీతో ఎన్‌ఎస్‌ఈ చెల్లించాలి. 
► ఆరు నెలల పాటు సెక్యూరిటీల మార్కెట్‌లోకి ఎన్‌ఎస్‌ఈ ప్రవేశంపై నిషేధం. ఈ కాలంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీవోకు కూడా అవకాశం ఉండదు. 
►  సెబీ ఆదేశాలతో ఆరు నెలల పాటు స్టాక్స్, కమోడిటీల్లో నూతన డెరివేటివ్‌ల ప్రవేశానికి వీల్లేదు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రిలయన్స్‌ ఫౌండేషన్‌ టీచర్‌ అవార్డులు

బయోకాన్‌ భళా!

4 శాతం ఎగిసిన బజాజ్‌ ఆటో ఆదాయం

ఆగని అమ్మకాలు : నష్టాల్లో మార్కెట్లు

నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్‌ ఫౌండర్స్‌

బీఓబీ లాభం రూ.826 కోట్లు

టాటా మోటార్స్‌ నష్టాలు 3,679 కోట్లు

డిసెంబర్‌ నాటికి వాట్సాప్‌ పేమెంట్‌ సేవలు

జెట్‌ రేసులో ఇండిగో!

ఆమ్రపాలి కుంభకోణం : ధోనీపై సంచలన ఆరోపణలు 

చైనాకు అవకాశాలు ఇవ్వొద్దు

రూ.199కే నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ విడుదలపై క్లారిటీ

వరుస నష్టాలకు చెక్‌ : స్టాక్‌మార్కెట్లో కళ కళ

10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..

ఎగవేతదారులను వదలొద్దు

బ్యాంకింగ్‌ ‘బాండ్‌’!

‘ఇన్నోవేషన్‌’లో భారత్‌కు 52వ ర్యాంకు

హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!

ఆ ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ

ఇండిగో సంక్షోభానికి తెర : షేరు జూమ్‌

అమెజాన్‌కు షాక్‌: నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్లాన్‌

10 వేల ఉద్యోగాలకు ఎసరు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

భారత పారిశ్రామికవేత్త అరెస్ట్‌

ఆర్‌బీఐ ‘ఉత్కర్ష్‌ 2022’

నిలిచిపోయిన ముకేశ్‌ డీల్‌..!

కంపెనీలకు డేటా చోరీ కష్టాలు

‘59 మినిట్స్‌’తో రూ. 5 కోట్లు!

తగ్గిన ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నష్టాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

అందరూ ఆలోచించేలా...