మోసపూరిత ఎస్‌ఎంఎస్‌లకు చెక్‌!!

19 Aug, 2017 01:00 IST|Sakshi

సెబీకి ట్రాయ్‌ సాయం
న్యూఢిల్లీ: మోసపూరిత బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లను నియంత్రించడానికి టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ సాయం తీసుకున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబి తెలిపింది. పలానా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం, అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ  ఎస్‌ఎంఎస్‌లు వస్తుంటాయి. ఇలాంటి స్టాక్స్‌ టిప్స్‌కు సంబంధించిన మోసపూరిత ఎస్‌ఎంఎస్‌లకు చెక్‌ పెట్టేందుకు ఇక సెబీ, ట్రాయ్‌ కలిసి పనిచేయనున్నాయి.

ఇవి ప్రస్తుతం అమల్లో ఉన్న  నిబంధనలను, విధానాలను సమీక్షించనున్నాయి. సెబీ నిబంధనల ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లు,  సంస్థలు మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించిన సలహాలను, స్టాక్స్‌ టిప్స్‌ను ఇవ్వాలి. వీరు కూడా సెబీ వద్ద రిజస్టర్‌ చేసుకోవాలి. కాగా బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లను పంపుతున్న వారిని గుర్తించడంలో సెబీ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో వారిపై సరైన చర్యలు కూడా తీసుకోలేకపోతోంది.    

మరిన్ని వార్తలు