ఫండ్స్ అమ్మకాలకు ఊతమిచ్చేలా కొత్త నిబంధనలు

28 Oct, 2015 02:56 IST|Sakshi
ఫండ్స్ అమ్మకాలకు ఊతమిచ్చేలా కొత్త నిబంధనలు

ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాటి పథకాల అమ్మకాలకు మరింతగా ఊతమిచ్చే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. ఈ-కామర్స్ సైట్లలో కూడా ఫండ్స్ అమ్మకాలకు వెసులుబాటు కల్పించడంతో పాటు పలు చర్యలు తీసుకోనుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా సెబీ చైర్మన్ యూకే సిన్హా ఈ విషయాలు చెప్పారు.

ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని సులభతరం చేసేందుకు కస్టమర్ల వివరాలు ఆన్‌లైన్‌లోనే సమర్పించడం, ధృవీకరించడం మొదలైన ప్రక్రియలు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. ఫండ్ పరిశ్రమకు తోడ్పాటునిచ్చేందుకు తీసుకోతగిన చర్యలను సూచిం చేందుకు నందన్ నీలేకని సారథ్యంలో ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు సిన్హా పేర్కొన్నారు. ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ సంస్థలు దాదాపు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే అసెట్స్‌ను నిర్వహిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు