సెబిలో కరోనా కలకలం..

21 May, 2020 13:21 IST|Sakshi

దేశ స్టాక్‌ మార్కెట్లను నియంత్రించే సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబి)లో  కరోనా కలకలం సృష్టించింది. సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఇంకొకరికి కోవిడ్‌ 19 పాజిటివ్‌ ధృవీకరణ రావడం సంస్థలో ఆందోళన పుట్టించింది. దీంతో సెబి ముఖ్య కార్యాలయాన్ని ఎన్‌సీఎల్‌ బిల్డింగ్‌లోకి తాత్కాలికంగా తరలించాలని, ప్రస్తుతం కార్యాలయమున్న బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లోని భవనాలని పూర్తిగా శానిటైజ్‌ చేయాలని నిర్ణయించారు. మే 7న సెబిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడం, దీంతో బాంద్రాకుర్లా కాంప్లెక్సులోని భవనాలన్నింటిని శానిటైజ్‌ చేయడం జరిగింది. ఇప్పుడీ రెండో కేసు వార్తలతో కార్యాలయాన్ని తాత్కాలికంగా తరలించనున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి సెబి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఉందని, అందుకే మార్కెట్లు పనిచేస్తున్న సమయాన సెబి సైతం నిర్విరామంగా పనిచేస్తునే ఉందని సంస్థ అధికారులు చెప్పారు. నిజానికి లాక్‌డౌన్‌ వేళ ఇతర సమయాల్లోకన్నా ఎక్కువగా సెబి పనిచేయాల్సిఉంటుందన్నారు. ఇలాంటి తరుణంలో సంస్థ ఉద్యోగులకు కరోనా రావడం ఆందోళన కలిగిస్తోంది. 

మరిన్ని వార్తలు