ఇక మూడు రోజుల్లోనే లిస్టింగ్‌

19 Sep, 2018 00:24 IST|Sakshi

ఎఫ్‌పీఐలకు కొత్త కేవైసీ నిబంధనలు  

మ్యూచువల్‌ ఫండ్‌ వ్యయాలు తగ్గింపు  

కమోడిటీ డెరివేటివ్స్‌లోకి విదేశీ ఇన్వెస్టర్లకు అనుమతి  

పలు కీలక ప్రతిపాదనలకు సెబీ ఆమోదం

ముంబై: మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ  మంగళవారం జరిగిన బోర్డ్‌ సమావేశంలో  పలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సంబంధించిన సవరించిన కొత్త కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌)నిబంధనలకు ఆమోదం తెలిపామని, త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వెల్లడించారు.

ఐపీఓకు వచ్చిన కంపెనీలు స్టాక మార్కెట్లో లిస్టయ్యే సమయాన్ని తగ్గించామని, అలాగే మ్యూచువల్‌ ఫండ్‌ చార్జీలను కూడా తగ్గించామని వివరించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ మొత్తం వ్యయాలు 2.25 శాతానికి మించకుండా పరిమితిని విధించామని. ఫలితంగా ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వ్యక్తుల ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్స్‌ను విశ్లేషించే అధికారాలు సెబీకి ఇవ్వాలని త్వరలో ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. సెబీ ఆమోదం తెలిపిన కొన్ని ముఖ్య నిర్ణయాలు.

ఐపీఓ ముగిసిన తర్వాత ఆరు రోజులకు కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యేవి. ఇప్పడు ఈ సమయాన్ని మూడు రోజులకు కుదింపు  
 ఐపీఓలలో షేర్లు కొనుగోలు చేసే రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) పేరుతో ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది.  
కొన్ని షరతులకు లోబడి కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లకు అనుమతి.
దేశీయ మార్కెట్లలో ట్రేడింగ్‌ చేయడానికి నమోదు చేసుకోవడానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఒకటే దరఖాస్తు సమర్పిస్తే చాలు.
కావాలని రుణాలు ఎగవేసిన వాళ్లు, ఆర్థిక నేరగాళ్లు సెటిల్మెంట్‌ ప్రక్రియలో పాల్గొనలేరు.
 ఆర్థిక నేరగాళ్లు ఓపెన్‌ ఆఫర్లను ప్రకటించలేరు.
స్టాక్‌ మార్కెట్లో లిస్టైన దిగ్గజ కంపెనీలు తమ దీర్ఘకాలిక రుణావసరాల్లో కనీసం 25 శాతం వరకూ కార్పొరేట్‌ బాండ్ల ద్వారానే సమీకరించాలి.  
♦  లిస్టైన కంపెనీల్లో మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులను ఆయా కంపెనీలు సవివరంగా ఒక జాబితాను  రూపొందించాల్సి ఉంటుంది.    


కొచర్‌ సమస్య పరిష్కారంపై చర్చ...
ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందాకొచర్‌ భర్తకు సంబంధించిన వ్యాపార లాదేవీల విషయమై తమ షోకాజు నోటీసుకు బ్యాంకు స్పందించిందని సెబీ చీఫ్‌ తెలిపారు. అంగీకారం ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు బ్యాంకు అనుమతి కోరిం దన్నారు.

కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌ వీడియోకాన్‌ గ్రూపుతో కొన్నేళ్లుగా ఎన్నో వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నట్టు సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ప్రయోజన వివాదం కింద లిస్టింగ్‌ నిబం ధనలు పాటించకపోవడంపై సెబీ షోకాజు నోటీసు జారీ చేసింది. తమ వైపు నుంచి నియంత్రణపరమైన వైఫల్యం ఏదీ లేదని ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు చందా కొచర్‌ షోకాజు నోటీసులకు బదులిచ్చారు.

ట్రేడింగ్‌ వేళల పెంపుపై అనిశ్చితి...
స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల ట్రేడింగ్‌ వేళల పెంపు సాకా రం కావడానికి మరికొంత కాలం పట్టేట్లు ఉంది. ట్రేడింగ్‌ వేళల పెంపు విషయమై స్టాక్‌ ఎక్సే్చంజ్‌లు ఎలాంటి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు రాకపోవడంతో ఈ పెంపు మరికొంత కాలం వాయిదా పడే అవకాశాలున్నాయి. షెడ్యూల్‌ప్రకారమైతే, వచ్చే నెల ఒకటి నుంచి ఈక్విటీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ను రాత్రి 11.55 వరకూ కొనసాగించాలని సెబీ ఆలోచన.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు