సాక్షి...‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌!

20 Jul, 2017 01:10 IST|Sakshi
సాక్షి...‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌!

స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేసేవారికి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్‌ అండ్‌ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్‌? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్‌ ఇంట్రస్ట్‌ హెచ్చుతగ్గులు... కాల్, పుట్‌ రైటింగ్‌ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్‌ సిగ్నల్స్‌’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:  శుక్రవారం ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) రెండు రోజుల నుంచి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గత సోమవారం 9 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 1,559 వరకూ పెరిగిన తర్వాత మరుసటి రోజే రూ. 1,515 వరకూ పడిపోయింది. తిరిగి బుధవారం మార్కెట్‌ ముగింపు సమయంలో నాటకీయంగా కోలుకుని రూ. 1,532 వద్ద ముగిసింది. ఈ ఒడుదుడుకుల మధ్య ఆర్‌ఐఎల్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టులో తాజాగా 2.57 లక్షల షేర్లు యాడ్‌కావడంతో ఓపెన్‌ ఇంట్రస్ట్‌ (ఓఐ) 2.27 శాతం మేర పెరిగింది. స్పాట్‌ ధరతో పోలిస్తే ప్రీమియం రూ.5 నుంచి రూ. 6కు పెరిగింది.

ఫ్యూచర్స్‌ ఓఐ, ప్రీమియంలు పెరగడం ట్రేడర్ల పాజిటివ్‌ దృక్ప«థాన్ని సూచిస్తున్నది.   షేరు పెరిగినా, రూ. 1,540, 1,560 స్ట్రయిక్స్‌ వద్ద కాల్‌ కవరింగ్‌ స్వల్పంగానే జరిగింది. ఈ రెండు స్ట్రయిక్స్‌ వద్ద 9.5 లక్షల చొప్పున కాల్‌ బిల్డప్‌ వుంది. రూ. 1,500 స్ట్రయిక్‌ వద్ద తాజా పుట్‌ రైటింగ్‌ కూడా పెద్దగా జరగలేదు. కేవలం 30,000 షేర్లు యాడ్‌కావడంతో ఇక్కడ పుట్‌ బిల్డప్‌ 6.26 లక్షలకు చేరింది. ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఆప్షన్‌ రైటర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఈ బిల్డప్‌ వెల్లడిస్తున్నది. çఫలితాలు వెల్లడయ్యేలోపు మరోదఫా రూ. 1,540–1,560 శ్రేణివరకూ పెరిగే ప్రయత్నం చేయవచ్చని, నాటకీయంగా అమ్మకాలు జరిగితే రూ. 1,500 వద్ద మద్దతు పొందవచ్చని ఈ ఆప్షన్‌ బిల్డప్‌ సంకేతాలిస్తున్నది.  

మరి ఐడియా సెల్యులర్‌ డేటా ఏం చెబుతోంది?
వేదాంత ఫ్యూచర్‌ సంకేతాలెలా ఉన్నాయి?
ఈ వివరాలు www.sakshibusiness.com-లో

మరిన్ని వార్తలు