జూలైలో.. రెండో దశ భారత్‌ బాండ్స్‌ ఈటీఎఫ్‌ల జారీ

22 May, 2020 15:04 IST|Sakshi

 రెండో దశలో భాగంగా భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లను జారీకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఎడెల్వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. జూలై నెలలో రెండు కొత్త సిరీస్‌ల ద్వారా భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లను జారీ చేసి రూ.14,000 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు ఎడెల్వీజ్‌ తెలిపింది. ఈ రెండు సిరీస్‌లలో మెచ్యూరిటీ పిరియడ్‌ను ఒక సిరీస్‌ ఏప్రిల్‌ 2025ను, రెండో సిరీస్‌కు ఏప్రిల్‌ 2031 నిర్ణయించినట్లు పేర్కొంది. గ్రీన్‌ షూ ఆప్షన్‌ ద్వారా రూ.3,000 కోట్లు, మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి అదనంగా రూ.11,000 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లు ఎడెల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ రాధిక గుప్తా చెప్పారు. వివిధ రకాల మెచ్యూరిటి కాల పరిమితులు రూపొందించడం వల్ల ఇన్వెస్టర్లకు ఎక్కువ ఆప్షన్‌లు లభిస్తాయని తద్వారా వివిధ రకాల పెట్టుబడులు భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లలోకి వస్తాయన్నారు. 

డీమ్యాట్‌ అకౌంట్‌ లేకపోయినప్పటికీ..
డీమ్యాట్‌ అకౌంట్‌ లేని వారికి సైతం భారత్‌ బాండ్‌ ఫండ్స్‌ ఆఫ్‌​ఫండ్స్‌(ఎఫ్‌ఓఎఫ్‌)ను అందిస్తున్నట్లు రాధిక వెల్లడించారు. నిఫ్టీ భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌లో AAA పబ్లిక్‌ రేటింగ్‌ కలిగిన ఎక్సిమ్‌ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, హడ్కో, ఐఆర్‌ఎప్‌సీ, నాబార్డ్‌, ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌టీపీసీ, పీఎఫ్‌సీ, ఎన్‌పీసీఐఎల్‌,పవర్‌గ్రిడ్‌, ఆర్‌ఈసీ, సిడ్బీబాండ్లు ఉంటాయి. గతేడాది డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ మొదటి దశలో రూ.12,400 కోట్లు సమీకరించిందని తెలిపారు. కాగా భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ జారీ కార్యక్రమం ఆరోగ్యకరమైన పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్నీ, ఎక్సెంజీలలో లిక్విడిటీని కల్పిస్తుంది. 

Related Tweets
మరిన్ని వార్తలు