సెల్ఫీ కాదు.. షెల్ఫీ..

16 Oct, 2017 04:06 IST|Sakshi

సెల్ఫీ.. ఇప్పటి జనరేషన్‌లో దీని గురించి తెలియని వారెవరూ లేరు.. అలాగే సరదాగా సెల్ఫీ తీసుకోని వారు కూడా ఉండరు. ఇప్పుడీ ట్రెండ్‌ను ఫ్రిడ్జ్‌లు కూడా ఫాలో అయిపోతున్నాయి. ‘షెల్ఫీ’లు తీసుకుని.. వాటిని స్మార్ట్‌ ఫోన్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నాయి కూడా. విషయమేమిటంటే.. సూపర్‌ బజార్‌కు వెళ్లినప్పుడు చాలా మంది అవసరమున్నా.. లేకున్నా.. ఎక్కువ సామాన్లు కొనేస్తుంటారు. ఫ్రిజ్‌లో ఏముందో తెలియక పోవడం వల్ల కూడా ఇది జరుగుతుంటుంది.

ఈ ఇంటెలిజెంట్‌ ఫ్రిడ్జ్‌లు అలాంటి అనవసర కొనుగోళ్లను.. వృథాను తగ్గిస్తాయి. తమ షెల్ఫ్‌లలో ఏమేం ఉన్నాయన్న దానిపై షెల్ఫీలు తీసి.. యజమాని సెల్‌ఫోన్‌కు పంపుతాయి. దీని వల్ల షాపింగ్‌ ఈజీ అవుతుంది. ఈ తరహా ఫ్రిడ్జ్‌ల కొనుగోళ్లు బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో బాగా పెరిగాయట. వీటి ధర సంగతి చూస్తే.. శామ్‌సంగ్‌ ఫ్యామిలీ హబ్‌ ఫ్రిడ్జ్‌ ధర అక్కడి కరెన్సీలో రూ.3.5 లక్షల దాకా ఉండగా.. బాష్‌ కంపెనీకి చెందిన హోం కనెక్ట్‌ ఫ్రిడ్జ్‌ ధర రూ.82 వేలుగా ఉంది.  

మరిన్ని వార్తలు