లాక్‌డౌన్‌ 4.0 : ‘బేర్‌’ మన్న దలాల్‌ స్ట్రీట్‌

18 May, 2020 16:26 IST|Sakshi

వెయ్యి పాయింట్లకు పైగా పతనం

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు  భారీ నష్టాలతో ముగిసాయి.  రోజంతా భారీ నష్టాలతో కొనసాగిన  కీలక  సూచీ  సెన్సెక్స్‌  చివరకు 1069 పాయింట్లు  పతనంతో  30028 వద్ద,  నిఫ్టీ  314  పాయింట్లు కోల్పోయి  8823 వద్ద ముగిసింది.  చివరికి నిఫ్టీ 8900  స్థాయిని కోల్పోవడం గమనార‍్హం. ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిసాయి.  నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1,260 పాయింట్లు  పతనమైంది.  రుచించని ప్యాకేజీ, లాక్‌డౌన్‌  పొడగింపు  లాంటివి  భారీ ప్రభావాన్ని చూపాయి. (కుప్పకూలిన మార్కెట్లు : 9 వేల దిగువకు నిఫ్టీ)

అలాగే ఇన్సాల్వెన్సీ అండ్ దివాలా కోడ్ (ఐబిసి) కింద  దివాలా కేసులు ఏడాది వరకు  ఉండవని  ప్రభుత్వం ప్రకటించడంతో ఫైనాన్షియల్స్, బ్యాంక్ స్టాక్స్ భారీ నష్టాలను మూటగ‍ట్టుకున్నాయి.ఇండస్ఇండ్ బ్యాంక్ 9.63 శాతం క్షీణించగా, హెచ్‌డీఎఫ్‌సీ,  మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్,  అల్ట్రాటెక్ సిమెంట్స్  టాప్‌ లూజర్స్‌ గా నిలిచాయి. టీసీఎఎస్, ఇన్ఫోసిస్.  ఐటీసీ, వేదాంతా  హెచ్‌సిఎల్ టెక్ మాత్రమే ఈ రోజు లాభాలను ఆర్జించాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి కూడా  బలహీనంగా ముగిసింది. శుక్రవారం నాటి ముగింపు 75.56తో పోలిస్తే, 75.91 వద్ద ముగిసింది. (కరోనా : ఉద్యోగులపై వేటు,​ క్లౌడ్ కిచెన్స్‌కు బ్రేక్‌)

మరిన్ని వార్తలు