12 వేల ఎగువకు నిఫ్టీ.. ‘జీ’ ఢమాల్‌

5 Feb, 2020 09:49 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం  ట్రేడర్ల కొనుగోళ్లతో మరింత పుంజుకుని సెన్సెక్స్‌ 169  పాయింట్ల లాభంతో 40,958 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 12034 వద్ద ట్రేడవుతున్నాయి. తద్వారా నిఫ్టీ 12వేల మార్కును క్రాస్‌ చేసింది. బ్యాంక్‌ నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 30,800 వద్ద ట్రేడవుతోంది. భారతి ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మోస్ట్‌ నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (3 శాతం నష్టం) అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇన్ఫోసిస్‌, టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, అదాని పోర్ట్స్ నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి పాజిటివ్‌గా కొనసాగుతోంది. బుధవారం 6 పైసలు ఎగిసిన రూపాయి 71.21 వద్ద  వుంది. 

మరిన్ని వార్తలు