ఊగిస లాట : సెన్సెక్స్‌ సెంచరీ లాభాలు

12 Sep, 2018 09:45 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు అంచనాలకు భిన్నంగా లాభాల్లో ప్రారంభమైనాయి. కీలకమద్దతు స్థాయిలకు పైన స్థిరంగా ప్రారంభమై ఇన్వెస్టర్లలో ఆశలే రేకెత్తిస్తున్నాయి. అయితే  పుల్‌ బ్యాక్‌ ర్యాలీగా ఎనలిస్టులు చెబుతున్నారు.   సెన్సెక్స్‌ 90 పాయింట్లు పుంజుకుని 37,503వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 11, 305  వద్ద ట్రేడ్‌ అయినా రుపీ దెబ్బతో  లాభాలనుంచి వెనక్కి ఫ్లాట్‌గా మారాయి. తిరిగి పుంజుకుని 132పైగా సెన్సెక్స్‌ లాభపడగా, నిఫ్టీ 39 పాయింట్లకుపైగా ఎగిసింది.  హిందాల్కో, టాటా మోటార్స్‌. ఐసీఐసీఐ , సన్‌ ఫార్మ టాప్‌ లూజర్స్‌గా ఉండగా,  వేదాంత, హెచ్‌యూఎల్‌,  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నష్టపోతున్నాయి.
కోల్‌ ఇండియా,  పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, ఎం అండ్‌ ఎండ్‌, విప్రో, అదానీ స్వల్పంగా లాభపడుతున్నాయి.
 

మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి చారిత్రక కనిష్టాన్ని నమోదు చేసింది. డాలరు మారకంలో  42 పైసలు కోల్పోయిన రూపాయి 72.88 వద్ద ఆల్‌ టైం  కనిష్టానికి చేరింది. 

మరిన్ని వార్తలు