లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

27 Aug, 2019 13:59 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. వరుసగా రెండవ రోజు హుషారుగా ప్రారంభమైనా, మిడ్‌సెషన్‌లో ఒడి దుడుకులకు లోనయ్యింది.  ఒక దశలో 200 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 126 పాయింట్లుప లాభంతో  37,618 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పురోగమించి 11,105 వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య వివాద పరిష్కార దిశగా  చైనాతో చర్చలు ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ సోమవారం ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు జోష్‌ వచ్చింది. 

ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ రంగాలు  బలపడ్డాయి. అయితే ఐటీ నష్టపోతోంది. టాటా మోటార్స్‌, బ్రిటానియా, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, గెయిల్‌, ఐషర్, యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌, అల్ట్రాటెక్, బీపీసీఎల్‌ లాభపడుతుండగా,  ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, కొటక్‌ మహీంద్రా, సిప్లా, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, జీ  నష్టపోతున్నాయి. 
 

మరిన్ని వార్తలు