సెన్సెక్స్‌ 36000- ఈ మిడ్‌ క్యాప్స్‌ స్పీడ్‌

3 Jul, 2020 12:43 IST|Sakshi

సెన్సెక్స్‌ 226 పాయింట్లు ప్లస్‌

36,000 పాయింట్ల మార్క్‌ ఎగువకు

మిడ్‌ క్యాప్స్‌ 10-6% మధ్య అప్‌

జాబితాలో బీడీఎల్‌, ఫిలిప్స్‌ కార్బన్‌

హెచ్‌ఏఎల్‌, టైమ్‌ టెక్నో, రెస్పాన్సివ్

అంతర్జాతీయ మార్కెట్ల ప్రోత్సాహంతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 226 పాయింట్లు జంప్‌చేసి 36,070కు చేరగా.. నిఫ్టీ 69 పాయింట్లు జమ చేసుకుని 10,621 వద్ద ట్రేడవుతోంది. వెరసి సెన్సెక్స్‌ 36,000 పాయింట్ల కీలక మార్క్‌ను అధిగమించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇంతకుమించిన స్పీడ్‌ను  ప్రదర్శిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో భారత్‌ డైనమిక్స్‌(బీడీఎల్‌), ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌(హెచ్‌ఏఎల్‌),  టైమ్‌ టెక్నోప్లాస్ట్‌, రెస్పాన్సివ్‌ ఇండస్ట్రీస్‌ చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం..

భారత్‌ డైనమిక్స్
ఎన్‌ఎస్‌ఈలో ఈ పీఎస్‌యూ షేరు ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 368 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 374 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది.. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 41,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 3.05 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఫిలిప్స్‌ కార్బన్‌బ్లాక్‌
కార్బన్‌బ్లాక్‌ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో  ప్రస్తుతం 10 శాతం జంప్‌చేసి రూ. 111 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 113 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 2.53 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో  14.24 లక్షల షేర్లు చేతులు మారాయి.

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్
రక్షణ రంగ ఈ పీఎస్‌యూ షేరు  ఎన్‌ఎస్‌ఈలో  ప్రస్తుతం 8 శాతం దూసుకెళ్లి రూ. 835 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 845 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 12,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో  61,000 షేర్లు చేతులు మారాయి.

టైమ్‌ టెక్నోప్లాస్ట్‌
ఇండస్ట్రియల్‌ ప్యాకేజింగ్ రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో  ప్రస్తుతం 5 శాతం లాభపడి రూ. 39 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 1.13 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 66,000 షేర్లు మాత్రమే చేతులు మారాయి.

రెస్పాన్సివ్‌ ఇండస్ట్రీస్‌
పీవీసీ, వినైల్‌ ఫ్లోరింగ్‌ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 87 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 74,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో  43,000 షేర్లు మాత్రమే చేతులు మారాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా