లాభాల జోరు : 9200 ఎగువకు నిఫ్టీ

17 Apr, 2020 16:33 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, మంచి వర్షపాతం అంచనాలు, ఆర్ బీఐ ప్రకటించిన ఆర్థిక  పటిష్ట చర్యలతో  కీలక సూచీలు వారాంతంలో లాభాల్లో ముగిసాయి.  ఒక దశలో ఆరంభ  వెయ్యిపాయింట్ల లాభం నుంచి వెనక్కి తగ్గిన సూచీలు మిడ్ సెషన్ నుంచి అదే రేంజ్ లో  పుంజుకున్నాయి.  వారాంతం కావడంతో ఆఖరి అర్థగంటలో లాభాల స్వీకరణతో చివరికి సెన్సెక్స్ 986 పాయింట్లు లేదా 3.2 శాతం  ఎగిసి 31,588 వద్ద,  నిఫ్టీ 274 పాయింట్లు లేదా 3 శాతం పెరిగి 9266 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 92వందల  ఎగువన స్థిరపడింది.  ప్రధానంగా బ్యాంకులు, ఫైనాన్షియల్స్, ఆటో ,  రియాల్టీ స్టాక్స్‌ లాభపడగా,  ఫార్మా ,  ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టాల్లో ముగిసాయి. యాక్సిస్ బ్యాంకు, ఐషర్  మోటార్స్, ఐసీఐససీఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్ , బజాజ్ ఫిన్ సర్వ్ , టీసీఎస్,కోటక్ మహీంద్ర, రిలయన్స్  భారీగా లాభపడ్డాయి.  నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్ , టెక్ మహీంద్రా, సన్ ఫార్మ, టైటన్ నష్టపోయాయి.

చదవండి కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం
రూపాయికి ఆర్‌బీఐ 'శక్తి'

మరిన్ని వార్తలు