కీలక మద్దతు స్థాయిలపైకి ప్రధాన సూచీలు

7 May, 2018 15:49 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం అరంభంలో శుభారంభానిచ్చాయి.  పీఎస్‌యూ బ్యాంకు, ఎనర్జీ  షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఉదయం నుంచి లాభాల్లో కొనసాగిన సూచీలు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. చివరకు సెన్సెక్స్‌ 293 పాయింట్లు పుంజుకుని 35,208 వద్ద, నిఫ్టీ 97 పాయింట్లు ఎగిసి 10,715 వద్ద ముగిశాయి.   దీంతో కీలక  సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా ముగిశాయి.

గెయిల్‌, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందాల్కో, టాటా స్టీల్‌ , ఐసీఐసీఐ టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి.  ఐటీ ఫార్మ నష్టపోయాయి. ఉజ్జీవన్‌, వర్క్‌హాడ్‌, అజంతా ఫార్మా, లుపిన్‌, టాటా ఎలక్సీ, అపోలో హాస్పిటల్‌, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, క్యాస్ట్రల్‌ , టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ నష‍్టపోయిన వాటిల్లో ఉన్నాయి.  అయితే కరెన్సీ మార్కెట్లో రూపాయి సోమవారం మరింత పతనమైంది. సుమారు 26పైసలు నష్టపోయి కీలకమైన మద్దతు స్థాయి 67 దిగువకు చేరింది.
 
 

మరిన్ని వార్తలు